Glass Shards In Pizza: పిజ్జాలో గాజు ముక్కలు వచ్చాయని కంప్లైంట్ చేసిన కస్టమర్.. పోలీసులు ఏం చెప్పారో తెలుసా

ప్రముఖ గ్లోబల్ పిజ్జా మేకింగ్ బ్రాండ్ డోమినోస్ నుంచి డెలివరీ అయిన ఒక పిజ్జాలో వినియోగదారుడికి గాజు ముక్కలు కనిపించాయి. ఈ విషయాన్ని అతడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై వారేం అన్నారంటే..

Glass Shards In Pizza: పిజ్జాలో గాజు ముక్కలు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడో కస్టమర్. అయితే, దీనిపై స్పందించిన పోలీసులు అతడికో సలహా ఇచ్చారు. ముంబైకు చెందిన ఒక వ్యక్తి ప్రముఖ పిజ్జా బ్రాండ్ అయిన డోమినోస్ నుంచి ఒక పిజ్జా ఆర్డర్ చేశాడు.

Vande Bharat Express: మళ్లీ ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు.. ఈ సారి ఎందుకో తెలుసా

బాక్స్‌లో పిజ్జా డెలివరీ చేశారు. బాక్స్ తెరిచి పిజ్జా తింటుండగా, మధ్యలో రెండు మూడు చిన్న గాజు ముక్కలు కనిపించాయి. వెంటనే దీన్ని ఫొటో తీసి, అతడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. గ్లోబల్ బ్రాండ్ అయిన డోమినోస్ నుంచి వచ్చిన పిజ్జాలో గాజు ముక్కలు ఉన్నాయని పేర్కొన్నాడు. దీనిపై డోమినోస్, డోమినోస్ ఇండియా, ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. దీనిపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ అంశంపై డోమినోస్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించారు.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

అప్పటికీ వాళ్లిచ్చే సమాధానంతో సంతృప్తి చెందకపోతే చట్టపరంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా, ఈ ఘటనపై డోమినోస్ సంస్థ స్పందించింది. తమ నిర్వహణా నిబంధనలను ఉల్లంఘించబోమని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని సంస్థ ప్రకటించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు