కమర్షియల్ A320 జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎయిర్ బస్ జెట్ టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఘటనకు కారణమైన పైలట్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. A320 విమానం కమర్షియల్ జెట్ 2019, నవంబర్ 12వ తేదీ సోమవారం నాగ్ పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం అదే రోజున బెంగుళూరులో ల్యాండ్ కావాల్సి ఉంది. బెంగళూరులో ల్యాండ్ అయ్యే క్రమంలో రన్ వే నుంచి డైవర్ట్ అయింది. పక్కనే ఉన్న గడ్డి మైదానంలో నుంచి దూసుకెళ్లింది.
ల్యాండింగ్ సమయంలో పైలట్ ఇంజిన్ వేగాన్ని మరింత పెంచి టేకాఫ్ చేేశాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండా టేకాఫ్ అయి డైవర్షన్ ఎయిర్ పోర్టు అయిన హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సిబ్బందిని విచారణ నిమిత్తం దింపివేశారు. ప్రమాదకర స్థితిలో టేకాఫ్ చేసిన పైలట్ పై చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను డీజీసీఏ ఆదేశించింది.
ఇటీవలే సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన గో ఎయిర్ విమానం కూడా అత్యవసరంగా ల్యాండైన సంగతి తెలిసిందే. ఏయిర్ బస్ ఏ 320 విమానం షెడ్యూల్ ప్రకారం పాట్నాకు వెళ్లాల్సి ఉంది. కానీ విమానంలో ఏదో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే పాట్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. ఇందులో 146 మంది ప్రయాణీకులున్నారు. సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read More : కంట్లోంచి రక్తంతో కాపాడమంటూ పోలీసులకు ట్వీట్ చేసిన మహిళ