దుర్గామాత అవతారంలో స్కూల్ పిల్లలు…సోషల్ మీడియాలో ప్రశంసలు

దుర్గామాతలా అసురులను సంహరిస్తూ ఉన్న స్కూల్ పిల్లల ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ కుమార్ అనే వ్యక్తి షేర్ చేసిన ీ ఫొటోలో…దుర్గాదేవి మహిషాసురను చంపిన దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల బృందం కనిపించింది. ఈ ఫోటోను చూసిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ఆ ఫొటోలోని చిన్నారులపై ప్రసంశలు కురిపించారు.

తాను ఇంతకంటే అత్యుత్తమైన మందిరాన్ని, విగ్రహాన్ని ఎక్కడా చూడలేదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. హ్యూమన్ స్పిరిట్ విషయానికి వస్తే పిల్లలు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని,అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అయితే ఈ ఫొటో ఎక్కడ తీసినదో షేర్ చేసిన వ్యక్తి ప్రస్తావించకపోయినప్పటికీ…ఆఫొటోలోని చిన్నారులపై మాత్రం సోషల్ మీడియా ప్రశంసలతో ముంచెత్తుతుంది. సూపర్…అద్భుతం…చిన్నారులే నిజమైన దేవుళ్లు…ఇదే భారత్ అందం అంటూ నెటిజన్లు చిన్నారులను మెచ్చుకుంటున్నారు.