Gold Price today : స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు

బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారంపై రూ.10 తగ్గగా, వెండిపై రూ.200 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.50 వేలకు దిగువన బంగారం ధర ఉంది. వెండి ధర రూ.67 వేలుగా ఉంది

Gold Price today : బంగారం నగలు కొనుక్కునేవారు ఇప్పుడు కొనుక్కోవడం మంచిదే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఈ ఏడాది బంగారం ధరల్లో చాలా మార్పు చాలా తక్కువగా ఉన్నాయి. 44 నుంచి 48 వేల మధ్య బంగారం ధరలు కదలాడుతూ ఉన్నాయి. గతేడాది రూ.56 వేలను తాకిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరిలోరూ.51 వేల వద్ద కదలాడింది. ఇక ఆ తర్వాత బంగారం ధర రూ.50 వేల దిగువకు వచ్చింది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గాయి..22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉంది. ఇక క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక ప్రస్తుత ధరల విషయానికి చూస్తే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,499 ఉంది. పది గ్రాముల బంగారం రూ.44990 ఉంది. కాగా పది గ్రాముల బంగారం రూ.10 తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,090 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా… 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.73 ఉంది. 10 గ్రాములు కావాలంటే ధర రూ.730 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,300 ఉండగా కేజీ వెండి ధర రూ.73,000 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.200 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.73,000 ఉంది. అంటే ఈ 4 నెలల్లో వెండి ధర రూ.5,700 పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు