Gold Rates Today : బంగారం ధర తగ్గింది.. ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండటంతో బంగారం ధరలు మంగళవారం 10 గ్రాములకు రూ. 45,500 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు 10 గ్రాములకు రూ రూ.45,500గా ఉంది.

Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండటంతో బంగారం ధరలు మంగళవారం 10 గ్రాములకు రూ. 45,500 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు 10 గ్రాములకు రూ రూ.45,500గా ఉంది. మరోవైపు సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 521 రూపాయలు లేదా 0.72 శాతం తగ్గి కిలోకు రూ. 71,358 రూపాయలకు చేరుకుంది. మునుపటి సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.71,879తో ముగిసింది. గత పది రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు పెరిగింది.. ఐదు సార్లు తగ్గింది. ఒకసారి మాత్రమే స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.4,550గా ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ.36,400 ఉంది.

సోమవారం తులం ధర రూ.192 తగ్గింది. ఇప్పుడు 10 గ్రాముల ధర రూ.45,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.4,963గా ఉంది. 8 గ్రాములు రూ.39,704గా ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,640 ఉంది. గత పది రోజుల్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం ఔన్సుకు 8 1,866.15 వద్ద ట్రేడ్ అవుతోంది.

మే 17 నుంచి సోమవారం కనిష్టానికి 1,843.99 డాలర్లకు పడిపోయింది. యుఎస్ బంగారు ఫ్యూచర్స్ ఔన్సుకు 0.1శాతం పెరిగి 1,868.40 డాలర్లకు చేరుకుంది. జూన్ 16 న రాత్రి 11:30 గంటలకు జరగాల్సిన కీలకమైన FOMC సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందే యుఎస్ బాండ్ దిగుబడి పుంజుకోవడంతో బంగారం ధరలు సోమవారం 4 వారాల కనిష్టానికి చేరుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు