Golden Mask : ఈ బంగారం మాస్క్ ఖరీదు రూ.5.70 లక్షలు

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు.

Golden Mask :  కరోనా వైరస్ వ్యాప్తి  నిరోధానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించటం తప్పనిసరి అయిన నేపధ్యంలో వివిధ రకాల మాస్క్ లు మార్కెట్ ను ముంచెత్తాయి.  కొంతమంది ఇంట్లో మిషన్ మీద కుట్టుకున్న మాస్కులే వాడుతున్నారు. దానితోపాటు తమ పరిసరాలను శానిటైజ్ చేసుకోవటం కూడా అలవాటు అయ్యింది ప్రజలకు.

కేసులు తగ్గుముఖం పట్టి… రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంత మంది మాస్క్ వాడకం తగ్గించేశారు. అయినా 80 శాతం ప్రజలు మాస్క్ మాత్రం ధరిస్తున్నారు.  మాస్క్ లు వచ్చిన కొత్తల్లో చీరలకు , డ్రస్ లకు మ్యాచింగ్ మాస్క్ లు కూడా వచ్చాయి.   అలాగే వజ్రాలు, ఆభరణాలు పొదిగిన మాస్క్ లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

Also Read : Railway Reservation : ఈ రోజు అర్ధరాత్రి నుంచి 7 రోజులు రాత్రి పూట రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదు

తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు. చందన్‌ దాస్‌ అనే నగల వ్యాపారి సుమారు రూ.5.70 లక్షల విలువైన గోల్డెన్‌ మాస్క్‌ను రూపొందించాడు. సుమారు 108 గ్రాముల బరువున్న ఈ మాస్క్‌ను తయారుచేయడానికి అతనికి 15 రోజులు పట్టింది.

బంగారు ఆభరణాలు ధరించడమంటే ప్రత్యేక ఆసక్తి ఉన్న చందన్‌ పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ మాస్క్‌ను ధరిస్తాడట. ఈ మాస్క్ ఫోటోను రీతూ పర్ణ ఛటర్జీ అనే యువతి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి దీంతో ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించింది. దాంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మాస్క్ చూస్తుంటే  ఆసందేహం కలగటం సహజమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు ధరిస్తున్న  మాస్క్ లు  నోరు. ముక్కును పూర్తిగా కప్పి ఉంచుతున్నాయి, కానీ ఈబంగారం మాస్క్ లో రంధ్రాలు కనపడుతున్నాయి. ఇవి ముక్కు , నోటిని ఎంతవరకు కప్పి ఉంచుతాయనేది డౌటే…?

ట్రెండింగ్ వార్తలు