Sundar Pichai Padma Bhushan Award : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డు.. అమెరికాలో ప్రదానం చేసిన భారత రాయబారి

గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అమెరికాలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు భారత ప్రభుత్వం తరపున శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, సుందర్ పిచాయ్ కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. 

Sundar Pichai Padma Bhushan Award : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అమెరికాలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు భారత ప్రభుత్వం తరపున శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, సుందర్ పిచాయ్ కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు.  సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అందజేయడం ఆనందంగా ఉందని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు. మదురై నుంచి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు.

భారత్-అమెరికా ఆర్థిక సాంకేతికతను బలోపేతం చేస్తుందని చెప్పారు. సంబంధాలు, ప్రపంచ ఆవిష్కరణలకు భారత ప్రతిభావంతుల సహకారాన్ని పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు. భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Sundar Pichai : కంపెనీలో చేసే పని కన్నా ఉద్యోగులే ఎక్కువ.. కోత తప్పదంటున్న గూగుల్ బాస్..!

పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసినందుకు భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, కాన్సుల్ జనరల్ ప్రసాద్ లకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ అపారమైన గౌరవం అందించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది నమ్మశక్యంగా లేదని, తనను తీర్చిదిద్దిన దేశం ఇలా గౌరవించడం అర్థవంతంగా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు.

భారతదేశం తనలో ఒక భాగమని, తాను ఎక్కడికి వెళ్లినా దేశాన్ని తన వెంట తీసుకెళ్తానని చెప్పారు.
డిజిటల్ ఇండియా దార్శనికత కచ్చితంగా దేశ అభివృద్ధికి యాక్సిలరేటర్ గా ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ ను కూడా పిచాయ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. భారత్ లో తాము 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని సుందర్ పిచాయ్ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు