Google Fined : గూగుల్‌కు భారత్‌లో భారీ షాక్.. రూ.1,337 కోట్ల జరిమానా

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు భారత్ లో గట్టి షాక్ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది.

Google Fined : గూగుల్‌కు భారత్‌లో భారీ షాక్.. రూ.1,337 కోట్ల జరిమానా

Updated On : October 20, 2022 / 11:32 PM IST

Google Fined : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు భారత్ లో గట్టి షాక్ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. దీంతో రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ హితవు పలికింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే దానికి ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్) కావాలి. అలాంటి ఓస్ లలో ఆండ్రాయిడ్ ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి.

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, య్యూటూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగుందని సీసీఐ పేర్కొంది. ఇక వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్దతులను గూగుల్ అవలంభిస్తోందని పేర్కొంటూ గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ అందించే ఫ్రీ ఇన్ స్టాల్ యాప్స్ ను డిలీట్ చేయకుండా నిరోధించడం వంటివి చేయకూడదు అంటూ పలు సూచనలు చేసింది.