గూగుల్ Bolo App : కిడ్స్‌కు  హిందీ, ఇంగ్లీష్‌లో టీచింగ్

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కిడ్స్ కోసం ఇండియాలో కొత్త యాప్ లాంచ్ చేసింది. అదే.. బోలో యాప్. ఈ యాప్ ద్వారా చిన్నపిల్లలు ఇంగ్లీష్, హిందీ భాషలో పుస్తకాలను చదువుకోవచ్చు.

  • Publish Date - March 6, 2019 / 12:36 PM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కిడ్స్ కోసం ఇండియాలో కొత్త యాప్ లాంచ్ చేసింది. అదే.. బోలో యాప్. ఈ యాప్ ద్వారా చిన్నపిల్లలు ఇంగ్లీష్, హిందీ భాషలో పుస్తకాలను చదువుకోవచ్చు.

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కిడ్స్ కోసం ఇండియాలో కొత్త యాప్ లాంచ్ చేసింది. అదే.. బోలో యాప్. ఈ యాప్ ద్వారా చిన్నపిల్లలు ఇంగ్లీష్, హిందీ భాషలో పుస్తకాలను చదువుకోవచ్చు. దేశ వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు పాఠ్యపుస్తకాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో బోలో యాప్ బోధిస్తుంది. ఎసర్ (ASER) సెంటర్ సహకారంతో గూగుల్ ఓపన్ బీటా ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది.
Also Read : ‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం

గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ ఫ్లాట్ ఫాం డెవలప్ చేసే దిశగా గూగుల్ ఈ కొత్త యాప్ ను కిడ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ యాప్ ద్వారా పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ఇందులో గూగుల్ స్పీచ్ రికగ్ననైజేషన్, టెక్స్ట్ టూ స్పీచ్ టెక్నాలజీ, రీడింగ్ Buddy (దియా) కూడా యాప్ లో యాక్సస్ చేసుకోవచ్చు. 

అంతేకాదు.. ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. వాయిస్ స్పీచ్ వర్డ్ ను కరెక్ట్ చేసుకుంటుంది. దియాలో టెక్స్ట్ చదవడమే కాదు.. ఇంగ్లీష్, హిందీలో కూడా పదాలకు అర్థం తెలుసుకోవచ్చునని గూగుల్ బ్లాగ్ పోస్టులో తెలిపింది. ఈ యాప్ లో రీడింగ్ మెటేరియల్ క్యాటలాగ్ కూడా ఉన్నాయి. ఇందులో ఎన్నో స్టోరీలు ఉంటాయి. పిల్లలు చదివేందుకు వీలుగా ఇంగ్లీష్ భాషలో 40 స్టోరీలు, హిందీ భాషలో 50 స్టోరీలు ఉంటాయి. ఈ స్టోరీలన్నీ పూర్తిగా ఉచితంగా గూగుల్ అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టోరీలను అందించే దిశగా గూగుల్ ప్లాన్ చేస్తోంది.

గూగుల్ అందించే బోల్ యాప్ లో ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్ ఉన్నాయి. ఫన్నీగా, ప్లేఫుల్ గా పదాలను పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా రూపొందించింది. బోలో యాప్ ను పిల్లలంతా తమ ప్రొగ్రెస్ ను వేర్వేరుగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ఆఫ్ లైన్ లో కూడా బోలో యాప్ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి యాడ్స్ డిసిప్లే కావు. దీంతో పిల్లలు రీడింగ్ పైనే దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇంటర్నేట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా యాక్సస్ అయ్యేందుకు వీలుగా గూగుల్ ఈ యాప్ ను రూపొందించింది. 

గూగుల్ అందించే Bolo యాప్ ఇండియాలోని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. అన్నీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 (కిట్ కాట్)కు హైయర్ వర్షన్ లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ప్రాంతీయ హిందీ మాట్లాడేవారి కోసం డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది. 
Also Read : దడ పుట్టించాడులే : దూరదర్శన్ ట్యూన్ తో బ్రేక్ డ్యాన్స్