కృష్ణుడికి ఉక్కపోస్తోందట : దేవాలయంపై మట్టికుండలు

ఇండోర్ : నల్లనయ్య..అంటే కృష్ణుడు. కృష్టుడికి కుండలతో చాలా అనుబంధం ఉంది. గోపెమ్మలు పాలు, పెరుగులున్న కుండలను నెత్తిన పెట్టకుని వెళుతుంటే కొంటె కృష్ణుడు ఆ కుండల్ని రాళ్లతో వెనకనుండి వాటికి పగులుగొట్టేవాడట..గొల్ల పడుచుల ఇళ్లల్లో ఉట్టిపై కుండల్లో దాచిన వెన్న మీగడలను దొంగిలించేవాడట. ఇటువంటి ఎన్నో సందర్భాలు కుండలతో కృష్ణుడికి ఉన్న అనుబంధాలు ఎన్నో..ఎన్నెన్నో. తాజాగా ఈ మట్టి కుండలతో కృష్ణుడి ఆలయంపై ఏకంగా 10వేల కుండల్ని పేర్చారు. మరి అది ఎందుకో తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్‌లోని రాజ్వాడాలో గల గోపాల్ మందిరం పైకప్పుపై కొన్ని వేల కుండలు కనిపిస్తుంటాయి. వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేడి నుంచి ఉపశమనానికి ఈ కొత్త టెక్నిక్ అమలు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. దీని కోసం మందిరంలోని చెక్కతో కూడిన పైకప్పుపై ఉంది. దానిపై పెద్ద ప్లాస్టిక్ కవర్‌ను పరిచారు. దానిపై అంతటా బంకమన్నును తాపడం చేశారు. ఆ మట్టిపై ఏకం 10 వేల కుండలను బోర్లించారు. కుండలకు మధ్య బంకమన్నును పోశారు.
దీంతో కుండలన్నీ అక్కడ అతుక్కుపోయాయి. కాగా రాజస్థాన్‌లో ఇటువంటి వేడి నుంచి ఉపశమనం కోసం ఇటువంటి పద్ధతిని వినియోగిస్తుంటారు. అదే టెక్నిక్ ను విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ క్రమలో గోపాల్ మందిరంలో కూడా వేడిని తగ్గించేందుకు ఆలయ నిర్వాహకులు ఈ కుండల టెక్నిక్ ఉపయోగించారు. మరి ద్వాపర యుగంలోనే కాదు ఈ కలియుగంలో కూడా నల్లనయ్య కుండల్ని వదల్లేదన్నమాట.