ఇక్కడే అమ్ముకోండి: ఉల్లి ఎగుమతి చేయడానికి వీల్లేదు

భారత కేంద్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు షాక్ ఇచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఉల్లి పంటను విదేశాలకు ఎగమతి చేయకూడదు. ఈ ఆజ్ఞ వెంటనే అమల్లోకి వస్తుందని రైతులు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టపరంగా ఎగుమతి చేసుకుని వ్యాపారం చేసుకునే రూల్‌ను బ్రేక్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి. 

నెల రోజులుగా ఢిల్లీలో ఉల్లి ధర భారీగా అంటే కేజీ 70-80రూపాయలుగా ఉంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా ఉల్లి కొరత ఏర్పడింది. దీని కారణంగా పటంను బయటకు పంపకుండా ఇక్కడే వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, లక్నోలలో రూ.60కేజీ దొరుకుతుంటే చెన్నై ప్రాంతంలో కేజీ రూ.42కు అమ్మతున్నారు. కాన్పూర్ లో ఉల్లిధర రూ.70గా ఉంది. అదే పోర్ట్ బ్లెయిర్ లో అయితే రూ.80వరకూ చేరుకుంది. 

ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి ప్రభుత్వంలో ఉల్లి రూ.23.90పైసలకే అమ్మాలని తెలిపారు. మార్కెట్‌లో ఉల్లి కొరత తీర్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకే వెళ్లి ఉల్లిని కొనుగోలు చేసింది.