ఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సర్వేల బాట పట్టింది. రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే
ఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సర్వేల బాట పట్టింది. రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత పంట సంవత్సర కాలానికి ఒక సర్వే చేపడతామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే(NSN) లో భాగంగా రైతుల ఆదాయం, ఖర్చు, రుణాల వివరాలు సేకరిస్తామన్నారు. అందుబాటులో ఉన్న డేటా, వనరులు, ఉద్యోగుల లభ్యత తదితర అంశాలను బట్టి ఈ సర్వే కాల వ్యవధి ఉంటుందని మంత్రి చెప్పారు.
2020నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్ఎస్ఎన్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేని చివరిసారిగా ఎన్ఎస్ఎన్‌వో 2012-2013 పంట కాలానికి చేపట్టింది. దీంతో 2014-18 మధ్య కాలంలో రైతుల స్థితిగతుల వివరాలు అందుబాటులో లేవని మంత్రి షెకావత్ చెప్పారు.