OCI, PIO card holders to travel to India కరోనా నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిసేధం విధించిన భారత్…ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడిలిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే కొన్ని ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరీల కింద దేశంలోకి వచ్చేందుకు విదేశీయులు, భారత పౌరులకు అనుమతించిన ప్రభుత్వం…ఇప్పుడు OCI(ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), PIO(పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) కార్డు హోల్డర్ల ప్రయాణానికి అనుమతినిచ్చింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. టూరిస్టు వీసా మీద తప్ప…నిర్దేశిత ఎయిర్ పోర్టులు, సీపోర్టు ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల గుండా వాయు, జల మార్గాల ద్వారా భారత్ లోకి OCI,PIO కార్డు హోల్డర్లు భారత్ లోకి ప్రవేశించవచ్చని హోంశాఖ సృష్టం చేసింది. టూరిస్టు వీసా కింద దేశానికి వచ్చే ప్రయాణీకులకు మాత్రం అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది.
https://10tv.in/india-bans-import-of-acs-with-refrigerants-from-china/
అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా ప్రకటించిన నిబంధనల్లో భాగంగా, ఎలక్ట్రానిక్, టూరిస్ట్, మెడికల్ వీసా మినహా మిగిలిన వీసాలన్నింటినీ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఆ వీసాల గడువు తేదీ గనుక ముగిసినట్లయితే, తాజా దరఖాస్తులతో మళ్లీ వీసా పొందవచ్చని తెలిపింది. ఇక వైద్య చికిత్స కోసం భారత్ కు రావాలనుకున్న విదేశీయులు మెడికల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.