బిగ్ బ్రేకింగ్ : జూన్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు

ఊహించని విధంగా లాక్ డౌన్ ను మరో నెల రోజులు పొడిగించింది మోడీ సర్కార్. జూన్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(మే-30,2020)కేంద్ర హోంమంత్రిత్వశాఖ లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా జూన్ 8నుంచి రెస్టారెంట్లు,ఆతిథ్య రంగ సేవలు, మాల్స్,ఆలయాలు తిరిగి తెరుచుకోవచ్చునని కేంద్రం తెలిపింది.

అయితే దేశవ్యాప్తంగా సాయంత్రం 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మాత్రం వ్యక్తులు బయట తిరగటంపై యథావిధిగా నిషేధం కొనసాగుతుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. పరిస్థితుల ఆధారంగా మైట్రో రైళ్లు,అంతర్జాతీయ విమానలు,స్విమ్మింగ్ పూల్స్,పార్క్ లు,సినిమా హాల్స్,జిమ్ లు ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు,విద్యాసంస్థలు మొదలైనవి అన్నీ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల తర్వాత తెరుచుకోబడతాయని తెలిపింది. ఫేస్ మాస్క్ లు ధరించడం,సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని తెలిపింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మినహా కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30వరకు ఎటువంటి మినహాయింపులు లేని లాక్ డౌన్ కొనసాగనుంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ లో లాక్ డౌన్ 5.0కి బదులుగా అన్ లాక్ 1అనే పదం ఉపయోగించబడింది. అన్ లాక్ 1 ఎకానమీపై ఫోకస్ ఉంచుతుంది.

సరుకుల రవాణా మరియు ప్రజలు రాష్ట్రంలో తిరిగేందుకు, లేదా రాష్ట్రం దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లేందుకు  ప్రత్యేక అనుమతి లేదా e-పర్మిట్ అవసరం లేదని శనివారం(మే-30,2020)విడుదల చేసిన అన్ లాక్-1 మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే, ప్రజారోగ్యం యొక్క కారణాలు మరియు పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం…. వ్యక్తుల కదలికలను నియంత్రించమని ప్రతిపాదించినట్లయితే, అటువంటి కదలికలపై ఉంచాల్సిన ఆంక్షలు మరియు అనుసరించాల్సిన విధానాలు సంబంధిత వాటికి సంబంధించి ఇది ముందుగానే విస్తృత ప్రచారం ఇస్తుందని తెలిపింది.

.అయితే లాక్ డౌన్ 4.0లో కర్ఫ్యూ సమయం రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఉండగా,ఇప్పుడు లాక్ డౌన్ 5.0లో(జూన్-30వరకు)రాత్రి కర్ఫ్యూ సమయం తగ్గించబడింది. జూన్ 30వరకు దేశవ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రం రాత్రి పూట తిరిగేందుకు మినహాయింపు ఉంది.