ప్రజల వాయిస్ ను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు…సోనియా

దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు.

శుక్రవారం(డిసెంబర్-20,2019)ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సోనియాగాంధీ మాట్లాడుతూ…ప్రభుత్వాలు తీసుకునే తప్పుడు నిర్ణయాలు,పాలసీలకు వ్యతిరేకంగా గళం వినిపించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల వాయిస్ ను పూర్తిగా పట్టించుకోలేదు. ప్రజల్లో ఉన్న అసమ్మతిని అణిచివేసేందుకు క్రూరమైన ఫోర్స్ ను ఉపయోగించుకోవాలని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా యువత, పౌరులపై బీజేపీ ప్రభుత్వం చేసిన క్రూరమైన అణచివేతపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బీజేపీ ప్రభుత్వ విభజన ఎజెండా మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐఐటిలు, ఐఐఎంలు మరియు ఇతర ప్రముఖ విద్యాసంస్థలలో ఆకస్మిక నిరసనలు జరిగాయి. పౌరుల వాయిస్ వినడం,ఆ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల విధి అని ఆమె తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం వివిక్షతతో ఉందని,ప్రతిపాదిత ఎన్ఆర్సీ ముఖ్యంగా పేదలను హర్ట్ చేసే విధంగా,హాని కలిగించేదిగా ఉందని సోనియాగాంధీ అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని,భారత రాజ్యాంగం విలువలను కాపాడుతుందని సోనియాగాంధీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు