ఎప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌లో సడలింపు.. కొన్ని ప్రాంతాలకు పరిమితం

  • Publish Date - April 3, 2020 / 09:05 AM IST

లాక్‌డౌన్ ప్రకటించి పదిరోజులు. దీంతో దేశానికి తాళం పడింది. ఆర్ధికవ్యవస్థ శీర్షాసనం వేసింది. ఇప్పటికే జీతాల్లేని జీవితాలు, ఉద్యోగాలు ఊడిపోతాయేమో అనే అంచనాలు మరోవైపు. ఇప్పుడేం చేయాలి? 21రోజుల లాక్ డౌన్ తర్వాతా…ఏం చేయాలి? లాక్‌డౌన్ నుంచి ఎలా బైటపడాలి? అనే ఆలోచనలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

21రోజుల లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత ఒకసారి లాక్ డౌన్‌ను ఎత్తివేస్తే.. తర్వాత ప్రజలు ఒకేసారి కాకుండా, దశలవారీగా ప్రజలు బయటకు రావడానికి.. అందుకు వీలుగా, ఉమ్మడిగా బైటపడే మార్గం (common exit strategy)ని తయారుచేయమని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వంలో కూడా తీవ్రంగా మథనం సాగుతోంది. లాక్‌డౌన్ ను కొనసాగించలేం. అలాగని ఒకేసారి ఎత్తివేయలేం. అందుకే “limited lockdown” విధానాన్ని కేంద్రం ప్రతిపాదించబోతోంది. లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న విధానానికి మార్కెట్ వ్యతిరేకం. ఇదే సమయంలో కరోనాను అడ్డుకోవాలి. అందుకే cluster containment విధానాన్ని అమలుచేయబోతోంది.

ఈ వ్యూహానికి కేంద్రంలోని మంత్రులు, సీనియర్ అధికారులు పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.  ఈ లెక్కన 14 సాయంత్రం ప్రధాని జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించబోతున్నారు. లాక్‌డౌన్‌లో సడలింపును ప్రతిపాదించబోతున్నారు. 

Also Read | అమెరికా ప్రయోగం సక్సెస్.. రోగ నిరోధక శక్తిని పెంచుతున్న వ్యాక్సిన్