Kapil Sibal: కొలీజియంను సమర్ధించిన కపిల్ సిబాల్.. కోర్టులు కాషాయమయం కావొద్దంటూ హెచ్చరిక

కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ ఏర్పాటును సుప్రీంకోర్టు తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాకపోతే రివ్యూ పిటిషన్‌ వేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు

Kapil Sibal: కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియంపై జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మద్దతుగా స్పందించారు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబాల్. దేశంలో అన్నీ కాషాయమయం అవుతున్నాయని, అయితే కోర్టులు కాషాయమయం కావొద్దంటే కొలీజియం వ్యవస్థే ఉండాలని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, జడ్జీల నియామకాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే జరిగే పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని సిబాల్ అన్నారు.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

ప్రస్తుత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుందని, ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా ఆక్రమించుకొని తమకు అనుకూలమైన జడ్జీలను నియమించుకోవాలని భావిస్తోందని సిబాల్ ఆరోపించారు. అదే జరిగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్లుగా సొంత మనుషులు ఉన్నారు. రాష్ట్రాల గవర్నర్లుగా భజనపరులు ఉన్నారు. ఇక ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్‌.. అన్ని చోట్లా సొంతవారే ఉన్నారు. ఇప్పుడు కోర్టుల్లో కూడా సొంత మనుషులనే జడ్జీలుగా నియమించుకోవాలని చూస్తోంది’’ అని సిబాల్ ఆరోపించారు.

Kerala: అర్జెంటీనా, ఫ్రాన్స్ అభిమానుల మధ్య ఘర్షణ.. ముగ్గురిపై కత్తి దాడి

కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ ఏర్పాటును సుప్రీంకోర్టు తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాకపోతే రివ్యూ పిటిషన్‌ వేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పారదర్శకత లేకపోవడం, సన్నిహితులను నియమించుకోవడం వంటి లోపాలు కొలీజియం వ్యవస్థలో ఉన్నాయని ఒప్పుకున్న సిబాల్.. నియామక అధికారాలు సుప్రీంకోర్టు చేతిలో ఉండడంతో హైకోర్టు జడ్జీలు కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుంటారని అన్నారు. అయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కొలీజయం వ్యవస్థే మంచిదని, అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉండడం సరికాదని సిబాల్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు