అయ్యో.. తాళి కట్టిన కొద్దిసేపటికే వరుడు మృతి.. అసలేం జరిగిందంటే.?

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జామ్‌ఖండి పట్టణంలో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.

wedding

Karnataka: కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జామ్‌ఖండి పట్టణంలో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వరుడు ప్రవీణ్ (25) వధువుకు మంగళసూత్రం కట్టిన కొన్ని నిమిషాల తరువాత అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ప్రవీణ్ మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో పెళ్లి వేడుక విషాదంగా మారింది.

 

వరుడు ప్రవీణ్ కు వధువు పూజతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పెండ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది. రెండు కుటుంబాల నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో ప్రవీణ్ వధువు పూజ మెడలో తాళికట్టారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వధువు మెడలో తాళికట్టిన కొద్దిసేపటికే ప్రవీణ్ అసౌకర్యానికిగురై ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే ప్రవీణ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె నొప్పి కారణంగానే అతను మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. ఈఘటనతో వివాహ వేడుకలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

యువకుల్లో గుండెపోటు ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో సంగీత్ ప్రదర్శన ఇస్తుండగా 23ఏళ్ల మహిళ గుండెపోటుకు గురై వేదికపైనే మరనించింది. గతేడాది డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లోని తన పాఠశాలలో క్రీడాపోటీ కోసం పరుగు పందెం సాదన చేస్తున్న సమయంలో 14ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.