viral video : పెళ్లిలో అత్తగారి డాన్స్..కరెన్సీ వర్షం కురిపించిన బంధువులు

పెళ్లి వేడుకల్లో వధూ వరుడు డ్యాన్సులు వేయటం సాధారణంగా మారిపోయింది.కానీ ఓ పెళ్లిలో అత్తగారు డ్యాన్స్ తో అద్దరగొట్టేసింది.అత్తగారి డ్యాన్స్..బంధువుల కరెన్సీ వర్షం కురిపిస్తుంటే కోడలు

viral video : పెళ్లిలో అత్తగారి డాన్స్..కరెన్సీ వర్షం కురిపించిన బంధువులు

Groom's Mother Sets Stage

Updated On : August 23, 2021 / 4:05 PM IST

Groom mother dance on stage  : ఇటీవల పెళ్లిళ్లలో సంగీత్‌లు, బారాత్‌లు, డ్యాన్స్‌లు సర్వసాధారణమైపోయాయి. సిగ్గుపడుతు వచ్చి పెళ్లిపీటలపై తలవంచుకుని ఒదిగి కూర్చునే వధులు మారాత్ లో డ్యాన్సులేస్తున్నారు. భలే భలే స్టెప్పులతో అద్దరగొట్టేస్తున్నారు. వరులు బుద్ధిగా ఒద్దికగా నిలబడి ఉంటే వధువులు మాత్ర డ్యాన్సులు ఇరగదీసేస్తున్నారు.

కొన్ని వేడుకల్లో వధూవరులతోపాటు, బంధువులు, స్నేహితులు స్టెప్పులతో ఇరగదీయడం కూడా చాలా కామన్‌గా మారిపోయింది. ఓ వధువు జానపదాల పాట ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాపా’ అంటూ చేసిన డ్యాన్స్ ఎంతగా పాపులర్ అయిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

కానీ పెళ్లి వేడుకల్లో అత్తగారు డ్యాన్స్ చేయటం బహుశా చూసి ఉండం. కానీ ఆ లోటు కూడా తీరిపోయింది ఓ పంజాబీ పాటకు వరుడి తల్లి వేసిన డ్యాన్స్ చూస్తే. భాంగ్రా నృత్యంతో అత్తగారు పెను సం‍చలనమే సృష్టించింది. ఆ వయస్సులో కూడా పడుచు పిల్లలు కూడా వేయలేని స్టెప్పులతో భలే ఎనర్జిటిగ్ గా వేసిందామె డ్యాన్స్. లేడి పిల్లలాగా చెంగు చెంగున ఎగురుతూ ఆమె వేసిన డాన్స్ కు వధువరులిద్దరూ చక్కగా చూస్తుండిపోయారు.

దీనికి తోడు ఆమె డ్యాన్స్ కు బంధువులు కూడా అంతే ఉత్సాహంగా డబ్బుల వర్షం కురిపిస్తూ ఎంకరేజ్ చేశారు. అటు అత్తగారి పెర్‌ఫామెన్స్‌కు వధువు ముచ్చటగా అలా చూస్తూ ఉండి పోయింది. ఈ వయసులో కూడా ఎంత ఎనర్జటిక్‌ స్టెప్స్‌! అంటూ నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో ఇప్పటివరకు 95k లైక్స్ తో దూసుకుపోతోంది.