×
Ad

Drone Chases : పెండ్లి కొడుకుపై కత్తితో దాడి.. నిందితులను వెంబడించిన డ్రోన్.. సినిమాలో సీన్‌ను తలపించేలా వీడియో వైరల్ ..

Drone Chases పెండ్లి పీటలపై భార్య పక్కన ఉన్న సమయంలో వరుడు సుజల్ రామ్ సముద్రపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

Drone Chases

Drone Chases Attackers : అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగుతుంది. డప్పు వాయిధ్యాలు, డీజే పాటలకు డ్యాన్సులతో సందడి వాతావరణ నెలకొంది. ఈ క్రమంలోనే విషాద ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కొడుకుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పొడిచాడు.. అడ్డుకునేందుకు యత్నించిన పెండ్లి కొడుకు తండ్రిపైనా దాడి చేశాడు. ఆ తరువాత తన ఫ్రెండ్ బైక్ ఎక్కి పారిపోతుండటంతో పెండ్లి వేడుకను చిత్రీకరణ కోసం ఉపయోగించిన డ్రోన్ కెమెరా వారిని వెంబడించింది. అచ్చం బాలీవుడ్ సినిమాలో ఛేజింగ్ సీన్లను తలపించేలా డ్రోన్ కెమెరా నిందితులను వెంబడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రంలోని అమరావతి బద్నేరా రోడ్డులోని ఓ పెళ్లి మండపంలో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెండ్లి పీటలపై భార్య పక్కన ఉన్న సమయంలో వరుడు సుజల్ రామ్ సముద్రపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వరుడు తండ్రి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో అతనిపైనా దాడి చేశాడు.

పెండ్లి మండపంలో ఉన్న కొందరు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారి నుంచి తప్పించుకొని మండపం బయటకు వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ రెడీగాఉన్న తన ఫ్రెండ్ బైక్ ఎక్కి పారిపోయారు. అయితే, పెండ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడానికి ఏర్పాటు చేసిన డ్రోన్‌ను ఆపరేటర్ నిందితుల వైపు పంపడంతో అది వారిని వెంబడించింది.

దాదాపు రెండుమూడు కిలో మీటర్ల వరకు డ్రోన్ కెమెరా బైక్ పై పారిపోతున్న నిందితులను వెంబడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో దృశ్యాలు అచ్చం బాలీవుడ్ సినిమాలో ఛేజింగ్ సీన్లను తలపించాయంటూ నెటిజనట్లు పేర్కొంటున్నారు.

వరుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే, డీజే పాటల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు వరుడు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డీజే పాటలకు నృత్యం చేస్తున్న సమయంలో వరుడు నిందితులను నెట్టడంతో వారి మధ్య వాదన జరిగిందని.. దీంతో ఆగ్రహించిన జితేంద్ర బక్షి అనే యువకుడు వరుడిని కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. డ్రోన్ తీసిన వీడియో ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.