Himachal pradesh Elections Result 2022 : హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ (35)ను దాటేసింది. దీంతో ఇక హిమాచల్ ప్రదేశ్ పీఠం కాంగ్రెస్ కు ఖరారు కానుంది. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థులు ఎవరు? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పేర్లలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి,హిమాచల్ ప్రదేశ్ మాజీ CM, దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభాసింగ్ పేర్లు చక్కర్లు కొడుతోంది.

Himachal pradesh Elections Result 2022 : గుజరాత్ లో ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో భారీగా పతనమైపోయిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ (35)ను దాటేసింది. దీంతో ఇక హిమాచల్ ప్రదేశ్ పీఠం కాంగ్రెస్ కు ఖరారు కానుంది. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థులు ఎవరు? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పేర్లలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి,హిమాచల్ ప్రదేశ్ మాజీ CM, దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభాసింగ్ పేర్లు చక్కర్లు కొడుతోంది.

సీఎం రేసులో ప్రతిభాసింగ్ ముందంజలో ఉన్నారు. ప్రతిభా సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య. మండీ లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెను సీఎంగా ఖరారు చేయవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రతిభాసింగ్ ను సీఎం చేయటానికి మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం.

కానీ అదే సమయంలో వీరభద్రసింగ్- ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది. సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విమక్రమాదిత్య భారీ ఆధిక్యతో కొనసాగుతున్నారు. సీఎం రేసులో విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది. పైగా యువకుడు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనవైపు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు కూడా వినిస్తున్నాయి.

ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యత కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సీఎం ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆశావహులు తమ యత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌కు కాంగ్రెస్ తరఫున సీఎంగా ఎవరు పగ్గాలు చేపడతారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు