యావదాస్తి రూ.200 కోట్లను విరాళంగా ఇచ్చేసిన దంపతులు.. కూతురు, కొడుకు అడుగుజాడల్లో తామూ నడవాలని నిర్ణయం

Businessman: ఆ తర్వాత చెప్పులు కూడా ధరించకుండా దేశాటన చేస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తారు. ఆ సమయంలో కేవలం తెలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు.

గుజరాత్‌కు చెందిన జైన దంపతులు దాదాపు రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చేసి సన్యాసం స్వీకరిస్తున్నారు. మోక్ష మార్గంలో పయనించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఓ వేడుకలో భావేశ్ భండారి అనే వ్యాపారవేత్త, ఆయన భార్య తమ సంపద మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నెల చివరి వారంలో అధికారికంగా సన్యాసం స్వీకరించనున్నారు. భావేశ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణిస్తున్నారు. హిమ్మత్‌నగర్‌లో ఆయన కుటుంబం నివాసం ఉంటుంది. 2022లో భావేశ్ దంపతుల కుమార్తె (19), కుమారుడు (16) కూడా సన్యాసం స్వీకరించారు.

ఇప్పుడు తమ పిల్లల్లానే తాము కూడా సన్యాసం స్వీకరిస్తామని ఆ దంపతులు ప్రకటించారు. ఈ నెల 22న వారు సన్యాసం స్వీకరించి, ఆ తర్వాత చెప్పులు కూడా ధరించకుండా దేశాటన చేస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తారు.

ఆ సమయంలో కేవలం తెలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు. రెండు జతల తెలుపు రంగు దుస్తులు మాత్రమే వారి వద్ద ఉంటాయి. అన్ని కోట్ల రూపాయల సంపాదించిన ఆ కుటుంబం అన్నింటినీ వదిలేసి సన్యాసాన్ని స్వీకరించడం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసున్న అవిభక్త కవలలుగా గుర్తింపు పొందిన లోరీ, జార్జ్ కన్నుమూత

ట్రెండింగ్ వార్తలు