43 ఏళ్ల మహిళ బ్రేకప్ చెప్పిందని ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్

43 ఏళ్ల మహిళ బ్రేకప్ చెప్పిందని ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్

Updated On : December 1, 2020 / 4:57 PM IST

Gujarat: గుజరాత్ లోని అంబావడీకి చెందిన 43ఏళ్ల మహిళపై బ్లాక్ మెయిల్ మొదలైంది. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేయడంతో పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఈ క్రమంలో మహిళ సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించి కంప్లైంట్ ఫైల్ చేసింది.

బాధితురాలు క్యాటరింగ్ సర్వీస్ లో వంట మనిషిగా పనిచేస్తున్న ఇద్దరు పిల్లలతో పాటు అంబావడీలోనే ఉంటుంది. తన పెద్ద కూతురికిలో రాజ్ కోట్ లో ఉంటున్న వ్యక్తితో వివాహం జరిపించింది. 15ఏళ్ల క్రితమే ఆమెను భర్త వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి పిల్లలతో ఆమె ఒంటరిగానే ఉంటుంది.



సంవత్సరన్నర క్రితం పనిచేసే చోట ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమైంది. క్రమంగా వారిద్దరి మధ్య రిలేషన్ బలపడింది. ఆ సమయంలో తీసుకున్న పర్సనల్ ఫొటోలు ఆ వ్యక్తి దగ్గరే ఉండిపోయాయి. ఆ తర్వాత రియలైజ్ అయిన ఆమె రిలేషన్‌షిప్ కు ముగింపు పలకాలని ఫిక్స్ అయి అతడికి చెప్పేసింది.

అలా చేస్తే ఫొటోలను సర్క్యూలేట్ చేస్తానని బెదిరించాడు. పెడచెవిన పెట్టిన ఆమెకు షాక్ ఎదురైంది. ఆ వ్యక్తి అన్నంత పనిచేశాడు. మేనల్లుడికి ఆమె ఫొటోలను పంపించి బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాధిత మహిళ సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించి గురువారం ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసింది.