Gujarat Man : వ్యాక్సిన్..వ్యాక్సిన్..యువకుడి వినూత్న ప్రమోషన్

వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్ లో యువకుడు వినూత్న ప్రయత్నం చేపట్టాడు. బస్టాండులో నిలుచుని...మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా ? అయితే..వెంటనే తీసుకోండి..అంటూ...చెబుతున్నాడు.

Promotes Vaccination Programme : కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పంపిణీ చేపట్టిన సంగతి తెలిసేందే. తొందరలోనే ప్రజలందరికీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించి ఆ దిశగా చర్యలు తీసుకొంటోంది. ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. కానీ..కొంతమంది వైరస్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

Read More : Taliban-UN : మాట్లాడేందుకు అవకాశమివ్వండి..యూఎన్ కి తాలిబన్ లేఖ

వ్యాక్సిన్ తీసుకొనే ముందు..తీసుకొన్న తర్వాత..పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అనారోగ్యం బారిన పడుతామనే భయం చాలా మందిలో నెలకొంది. దీంతో వారు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవరడం లేదు. ప్రతొక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ప్రజల్లో చైతన్యం, అవగాహన తెప్పించేందుకు పలు కార్యక్రమాలు కూడా చేపట్టాయి.

Read More : London: భారత్ హెచ్చరిక.. దిగొచ్చిన బ్రిటన్.. UK కొత్త టీకా విధానం!

ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్ లో ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేపట్టాడు. కూరగాయాలు విక్రయించే వాళ్లు..ఏమంటారు ? కూరగాయలు..అంటూ అరుచుకుంటూ వెళుతుంటారు కదా. ఇతను కూడా అలాగే చేశాడు. వ్యాక్సిన్..వ్యాక్సిన్ అంటూ పెద్దగా అరుస్తున్నాడు. మొదటి డోస్, రెండో డోస్ ఏదైనా తప్పకుండా తీసుకోవాల్సిందేనంటూ చెబుతున్నాడు. బస్టాండులో నిలుచుని…మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా ? అయితే..వెంటనే తీసుకోండి..అంటూ…వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇతని ప్రయత్నానికి నెటిజన్లు హ్యాట్పాఫ్ చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు