Taliban-UN : మాట్లాడేందుకు అవకాశమివ్వండి..యూఎన్ కి తాలిబన్ లేఖ

ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని

Taliban-UN : మాట్లాడేందుకు అవకాశమివ్వండి..యూఎన్ కి తాలిబన్ లేఖ

Taliban Un

Taliban-UN ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని అప్ఘానిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ఐక్యరాజ్య సమితి లేదా యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్​కు లేఖ రాశారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ను ఐరాసలో అప్ఘాన్ శశ్వత ప్రతినిధిగా నియమించినట్లు తెలిపారు.

ఐరాసలో ప్రస్తుతం అప్ఘాన్ ప్రతినిధిగా గులాం ఇసాక్‌జాయ్‌ స్థానంలో సుహైల్‌ షాహీన్‌ను తాజాగా నియమించినట్లు తాలిబ‌న్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి.. ఆంటోనియో గుటెరస్‌కు రాసిన లేఖలో సృష్టం చేశారు. ఐరాసలో శాశ్వత ప్రతినిధి మిషన్​ ముగిసిందని, ఇసాక్​ ఇకపై అప్ఘాన్​ ప్రతినిధి కాదని స్పష్టం చేశారు. అష్రఫ్​ ఘనీ దిగిపోయాడని, ప్రపంచంలోని ఏ దేశమూ ఆయన్ని అధ్యక్షుడిగా గుర్తించటం లేదని లేఖలో పేర్కొన్నారు.

READ NDA Exam : ఎన్డీయే పరీక్షకు మహిళలు..కేంద్ర విజ్ణప్తిని తిరస్కరించిన సుప్రీం

తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తకి రాసిన లేఖను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ ధ్రువీకరించారు. తాలిబన్ల విజ్ఞప్తి లేఖను 9 మంది సభ్యుల ఆధారాల కమిటీకి నివేదించినట్లు హక్‌ తెలిపారు.

కాగా, కొత్త ప్ర‌తినిధికి యూఎన్‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలంటే, ముందుగా 9 దేశాల క‌మిటీ ఆమోదం ద‌క్కాల్సి ఉంటుంది. అమెరికా, చైనా, ర‌ష్యా దేశాలు ఆ క‌మిటీలో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఈనెల 27న ఐరాస వార్షిక సమావేశాలు ముగియనుండగా అప్పటిలోగా ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో కొత్త ప్ర‌తినిధి షాహీన్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితిలో ప్ర‌సంగించే అవ‌కాశం ద‌క్క‌ద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. అయితే క‌మిటీ తన నిర్ణ‌యాన్ని చెప్పేవ‌ర‌కు ఇసాక్‌జాయినే ఆ స్థానంలో ఉంటార‌ని యూఎన్ చెప్పింది.