NDA Exam : ఎన్డీయే పరీక్షకు మహిళలు..కేంద్ర విజ్ణప్తిని తిరస్కరించిన సుప్రీం

వ‌చ్చే ఏడాది నుంచి నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(NDA) ప‌రీక్ష‌ల్లో మ‌హిళ‌లకు ప‌రీక్ష‌లు రాసే అవకాశం ఇవ్వాల‌ని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిష‌న్‌ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీం

NDA Exam : ఎన్డీయే పరీక్షకు మహిళలు..కేంద్ర విజ్ణప్తిని తిరస్కరించిన సుప్రీం

Sc (1)

NDA Exam వ‌చ్చే ఏడాది నుంచి నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(NDA) ప‌రీక్ష‌ల్లో మ‌హిళ‌లకు ప‌రీక్ష‌లు రాసే అవకాశం ఇవ్వాల‌ని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిష‌న్‌ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. మహిళలు వారి హక్కులను కోల్పోకూడదని తాము కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది నవంబర్ లో జ‌రిగే ఎన్డీఏ ప‌రీక్ష‌ల నుంచే మ‌హిళ‌ల‌కు అనుమ‌తి క‌ల్పించాల‌ని కోర్టు సృష్టం చేసింది.

ఈ ఏడాది న‌వంబ‌ర్ 14వ తేదీన రిలీజయ్యే నోటిఫికేష‌న్‌లోనే మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని యూపీఎస్సీని సుప్రీం ఆదేశించింది. ఒక‌వేళ మే 2022లో మ‌హిళ‌లు ప‌రీక్ష‌లు రాస్తే అప్పుడు వాళ్ల రిక్రూట్మెంట్ 2023 జూన్‌లో జ‌రుగుతుంద‌ని..ఇలాంటి చ‌ర్య‌ల‌తో జాప్యం చేయ‌లేమ‌ని, అమ్మాయిల‌కు ఆశలు నింపామ‌ని..ఇప్పుడు ఆ ఆశ‌ల్ని వ‌మ్ముచేయ‌లేమ‌ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది.

కాగా, గత నెలలో..నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో మహిళలో ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్డీయే పరీక్షలకు మహిళలకు అనుమతించాలని కోరుతూ కుష్ కర్లా అనే న్యాయవాది  సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 19ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకొని సాయుధ బలగాల్లో చేరి.. దేశానికి సేవ చేయాలని ఎంతో మంది అర్హత కలిగిన, ఔత్సాహిక మహిళలు భావిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. కానీ లింగ వివక్షతో వారి హక్కులను కాల రాస్తున్నారని పిటిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులను కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఎన్డీయే పరీక్షకు మహిళలను కూడా అనుమతించాని స్పష్టం చేసింది. మహిళలను ఎన్డీయేలో అనుమతించాలని, ఎంపిక అయిన వారికి పురుషులతో పాటు శిక్షణ ఇవ్వాలని.. లింగ వివక్ష సరికాదని జస్టిస్ సంజయ్ కిషన్, రిషికేశ్ రాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ గత నెల 18న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

READ PM Narendra Modi : మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలు దేరిన ప్రధాని మోదీ