Gujarat Jail Raid: గుజరాత్‌లో 1700 మంది పోలీసులు 17జైళ్లలో అర్థరాత్రి ఏకకాలంలో ఆకస్మిక దాడులు..

శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత గుజరాత్ రాష్ట్రంలో 17 జైళ్లలో 1700 మంది పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పలువురి నేరస్తుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Gujarat Jail Raid: శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని జైళ్లలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి సమయంలో జైళ్ల (Jail) లోకి వచ్చిన పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొనేందుకు ఆరాతీయడంతో అక్కడ శిక్ష అనుభవిస్తున్న నేరస్థుల్లో అయోమయం నెలకొంది. అసలేం జరుగుతుందో తెలియక పోలీసులు (police) తనిఖీలు పూర్తిచేసే వరకు నేరస్థులు గమ్మునుండిపోయారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో సబర్మతి (Sabarmati) తో సహా గుజరాత్‌లోని 17 జైళ్ల (17 jails) లో 1700 మంది పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులతో జైలు ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది.

Gujarat Assembly: బీబీసీపై చర్యలు తీసుకోవాలి.. కేంద్రాన్ని అభ్యర్థిస్తూ గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ఈ దాడుల్లో ఆయా జైళ్లలోని పలువురి ఖైదీల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ (Home Minister Harsh Sanghvi) తో పాటు హోంశాఖ సీనియర్ అధికారులు పోలీస్ భవన్ నుంచి పర్యవేక్షించారు. అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఏకకాలంలో ప్రారంభమైన దాడులు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో స్పీపర్ డాగ్‌లను కూడా పోలీసులు ఉపయోగించారు. తనిఖీల తీరును రికార్డు చేయడం జరిగిందని గుజరాత్ డీజీపీ వికాస్ సహాయ్ తెలిపారు.

Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యం, రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం

పోలీసులు ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా.. జైళ్లలో నేరస్థులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారోకూడా తనిఖీల్లో ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (CM Bhupendra Patel) కూడా సీఎం డ్యాష్ బోర్డ్ నుంచి ఈ దాడులను పర్యవేక్షించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే సబర్మతి అతిపెద్ద జైలు కావడంతో అక్కడ ఆ జైలులో దాడులు నిర్వహించేందుకు 300 మంది పోలీసులను కేటాయించారు. సబర్మతి జైలుతో పాటు అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, బరోడా, జామ్ నగర్, మెహసానా, భావ్ నగర్, బనస్ కథా సహా అన్ని జైళ్లలో ఈ ఆపరేషన్ కొనసాగింది.

ట్రెండింగ్ వార్తలు