Gujarat Assembly: బీబీసీపై చర్యలు తీసుకోవాలి.. కేంద్రాన్ని అభ్యర్థిస్తూ గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

బీబీసీ డాక్యూమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోని 135కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉందని గుజరాత్ అసెంబ్లీ అభిప్రాయ పడింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

Gujarat Assembly: బీబీసీపై చర్యలు తీసుకోవాలి.. కేంద్రాన్ని అభ్యర్థిస్తూ గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

PM Modi

Gujarat Assembly: బీబీసీ డాక్యూమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోని 135కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉందని గుజరాత్ అసెంబ్లీ అభిప్రాయ పడింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంపై మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ జీవితమంతా దేశ సేవకు అంకితం చేశారు. అభివృద్ధి సాధనాన్ని ఆయుధంగామార్చి భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని అన్నారు. అంతేకాదు,  దేశ వ్యతిరేక అంశాలకు తగిన సమాధానం ఇచ్చారని, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలపడంలో మోదీ చాలా కష్టపడ్డారని అన్నారు.

Gujarat Assembly election-2022: గుజరాత్ ప్రజల మద్దతు సంపాదించాలంటే కాంగ్రెస్ ఈ పని చేయాలి: మోదీ

ఈ ఏడాది జనవరిలో బీబీసీ 2002 సంవత్సరంలో గుజరాత్ అల్లర్లపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా డాక్యూమెంటరీ విడుదల చేసింది. అయితే, ఈ డాక్యూమెంటరీకి లింక్‌లను పంచుకునే బహుళ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై క్లీన్ చిట్‌ను పట్టించుకోకుండా అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా మోడీ నాయకత్వాన్ని సూచించినందుకు ఈ డాక్యూమెంటరీ వివాదానికి దారితీసింది. ఈ వివాదాస్పద డాక్యూమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే తాజాగా, గుజరాత్ అసెంబ్లీ బీబీసీ తీసిన డాక్యూమెంటరీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.