IT Raids On BBC : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల్లో సుమారు 60 గంటల పాటు సోదాలు జరిపారు ఐటీ అధికారులు.

IT Raids On BBC : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

IT Raids On BBC : బీబీసీ ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల్లో సుమారు 60 గంటల పాటు సోదాలు జరిపారు ఐటీ అధికారులు. ఆదాయపు పన్ను చట్టం, 1961(చట్టం)లోని సెక్షన్ 133A కింద ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ గ్రూప్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

వివిధ భారతీయ భాషల్లో కంటెంట్ గణనీయమైన వినియోగం ఉన్నప్పటికీ, వివిధ సమూహ సంస్థలు చూపే ఆదాయం, లాభాలు భారత దేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని ఐటీ అధికారుల సర్వే వెల్లడించింది. ఆదాయంగా వెల్లడించని నిర్దిష్ట చెల్లింపులపై పన్ను చెల్లించలేదని సూచించే సంస్థ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన అనేక ఆధారాలను ఆదాయపన్ను విభాగం అధికారులు సేకరించారు.

Also Read..IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

సెకంటెడ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకున్నారని, దీని కోసం భారతీయ సంస్థ సంబంధిత విదేశీ సంస్థకు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించిందని సర్వే కార్యకలాపాలు వెల్లడించింది. సర్వే ఆపరేషన్ ద్వారా ఉద్యోగుల స్టేట్‌మెంట్, డిజిటల్ సాక్ష్యాలు పత్రాల ద్వారా కీలకమైన సాక్ష్యాలను వెలికితీసింది ఆదాయ పన్ను విభాగం.

ప్రాథమికంగా, ఫైనాన్స్, కంటెంట్ డెవలప్‌మెంట్, ఇతర ఉత్పత్తి సంబంధిత వ్యవహారాలకు అనుసంధానించబడిన వాటితో సహా కీలకమైన పాత్ర ఉన్న ఉద్యోగుల స్టేట్‌మెంట్లు మాత్రమే రికార్డ్ చేశారు ఆదాయపన్ను విభాగం అధికారులు. మీడియా కార్యకలాపాలను సులభతరం చేయడానికి సర్వే ఆపరేషన్ ఒక పద్ధతిలో నిర్వహించబడిందని ఆర్ధిక శాఖ వెల్లడించింది.

Also Read..IT Raids On BBC: బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు కూడా కొనసాగుతున్న సోదాలు.. ఆఫీసులోనే అధికారుల నిద్ర

బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కు చెందిన కార్యాలయాల్లో మూడు రోజులపాటు జరిగిన ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. బీబీసీలో పని చేసే వారి నుంచి అధికారులు సమాచారం సేకరించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల నుంచి డేటా కాపీ చేసుకున్నారు. సోదాలు పూర్తయ్యాక బీబీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘ఢిల్లీ, ముంబైలోని మా కార్యాలయాల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు వెళ్లిపోయారు. అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’’ అని బీబీసీ తెలిపింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్టులుగా తీసిన డాక్యుమెంటరీ దేశ విదేశాల్లో దుమారం రేపింది. ఈ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. మోదీపై డాక్యుమెంటరీ రూపొందించిందనే కారణంతోనే బీబీసీని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.