IT Raids On BBC: బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు కూడా కొనసాగుతున్న సోదాలు.. ఆఫీసులోనే అధికారుల నిద్ర

కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్‌టాప్స్, మొబైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు

IT Raids On BBC: బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు కూడా కొనసాగుతున్న సోదాలు.. ఆఫీసులోనే అధికారుల నిద్ర

IT Raids On BBC: దేశంలోని పలు బీబీసీ కార్యాలయాలపై ఐటీ (ఆదాయపు పన్ను) శాఖ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు మూడో రోజైన గురువారం కూడా కొనసాగుతున్నాయి.

MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా.. ఎలా సాధ్యమైందంటే!

కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్‌టాప్స్, మొబైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన కొద్ది వారాల్లోనే కేంద్ర ఐటీ శాఖ బీబీసీపై దాడులు చేయడం సంచలనం కలిగిస్తోంది.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీబీసీని బెదిరించేందుకే కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు ఈ అంశంపై బీబీసీ వర్గాలు, బ్రిటన్‌లోని బీబీసీ అధినాయకత్వం స్పందించింది. ఈ దాడుల్ని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. ఐటీ శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఐటీ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఎలక్ట్రానిక్ డివైజెస్‌లోని ఎలాంటి సమాచారాన్ని డిలీట్ చేయకూదని సిబ్బందిని ఆదేశించినట్లు బీబీసీ తెలిపింది. ఈ దాడులపై ఐటీ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.