Gujarat: ఇండియాలో తొలిసారి సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్న మహిళ

పెళ్లి అంటే వేడుక.. జీవితంలోనే ఎప్పుడూ చూడని సెలబ్రేషన్. మరోవైపు లవ్ మ్యారేజ్ అనే వంకతో అసలు హడావుడే లేకుండా జరిగిపోయే పెళ్లిళ్లు విన్నాం. కానీ, సెల్ఫ్ లవ్‌తో కనీవినీ ఎరుగని రీతిలో మహిళ తనకు తానే పెళ్లి చేసుకోనున్న విషయం వైరల్ అయింది.

Gujarat: ఇండియాలో తొలిసారి సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్న మహిళ

Marriage

Updated On : June 2, 2022 / 1:22 PM IST

 

 

Gujarat: పెళ్లి అంటే వేడుక.. జీవితంలోనే ఎప్పుడూ చూడని సెలబ్రేషన్. మరోవైపు లవ్ మ్యారేజ్ అనే వంకతో అసలు హడావుడే లేకుండా జరిగిపోయే పెళ్లిళ్లు విన్నాం. కానీ, సెల్ఫ్ లవ్‌తో కనీవినీ ఎరుగని రీతిలో మహిళ తనకు తానే పెళ్లి చేసుకోనున్న విషయం వైరల్ అయింది. 24ఏళ్ల క్షమా బిందు అనే మహిళ జూన్ 11న వివాహం చేసుకోనుంది. భారతదేశంలో ఇలాంటి వివాహం జరగడం ఇదే తొలిసారి.

హిందూ సంప్రదాయ ప్రకారమే పెళ్లి జరుగుతున్నా.. తనకు తానుగా మూడు ముళ్లు వేసుకుని వివాహం చేసుకుంది. వినటానికే విచిత్రంగా అనిపిస్తున్నా.. ఆమె పెళ్లి తర్వాత హనీమూన్ కూడా ప్లాన్ చేయడం ముందు ఈ విషయం చిన్నగానే అనిపిస్తుంది.

గోత్రీలోని గుడిలో జరగనున్న వివాహంలో ఐదు ప్రమాణాలు చేయనుంది క్షమా. ఇది పూర్తిగా మహిళకు చెందిన విషయం కాబట్టి దీనిని హైలెట్ చేయాలనుకుంటున్నానని తెలిపిందామె.

Read Also: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు

“నేనెప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ, పెళ్లి కూతురు కావాల్సి వచ్చింది. అందుకే నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇండియాలో ఇలాంటి పెళ్లి జరగలేదు. సెల్ఫ్ మ్యారేజ్ అనేది నీకు నువ్వే హద్దులు లేని ప్రేమ చూపించుకునేది. ఇది నువ్వునిన్నే ఒప్పుకోవాల్సింది. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ, నన్ను నేను ప్రేమిస్తున్నా. అందుకే పెళ్లి చేసుకుంటున్నా” అని క్షమా చెప్పింది.

తన పేరెంట్స్ రియాక్షన్ గురించి అడగ్గా.. వాళ్లు ఓపెన్ మైండెడ్ అని.. పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పింది క్షమ.