airline ఉద్యోగి చెంప ఛెళ్లుమనిపించిన SI : పోలీసు పొగరుకి థమ్కీ ఇచ్చిన సిబ్బంది

  • Publish Date - November 18, 2020 / 11:57 AM IST

Gujrat Ahmedabad : cop slaps airline staff : ఎయిర్ పోర్ట్ కు లేట్ గా వచ్చిందే కాకుండా..బోర్డింగ్ పాస్ ఇవ్వలేదనీ పోలీసోడిని అనే పొగరుతో ఓ ఎస్సై ఎయిర్ లైన్స్ ఉద్యోగిపై విరుచుకుపడ్డాడు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ ఉద్యోగి చెంప ఛెళ్లుమనేలా కొట్టాడు. మరి విమాన సిబ్బంది ఊరుకుంటారా? ఆ పోలీసోడిని పోలీస్ స్టేషన్ కే పంపిచారు.



వివరాల్లోకి వెళితే..గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి ఢిల్లీ వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులతో కలిసి మంగళవారం (నవంబర్17,2020) అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ముగ్గురు కలిసి ఢిల్లీకి వెళ్లడం కోసం స్పైస్‌జెట్‌ ఎస్‌జీ-8194 ఫ్లైట్ లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ నిర్ణీత సమయానికంటే చాలా లేట్ గా వచ్చారు.




https://10tv.in/covid-19-vaccine-centre-may-not-procure-pfizer-shots-at-all/
దీంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది బోర్డింగ్‌కు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో సదరు పోలీసు అధికారి, స్పైస్‌జెట్‌ స్టాఫ్‌తో గొడవకు దిగాడు. తమకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వకపోవటం ఆగ్రహంతో ఊగిపోయాడు. ఘర్షణ పెట్టుకున్నాడు. అక్కడితో ఊరుకోకుండా..ఓ ఉద్యోగి చెంప పగలకొట్టాడు.


దాంతో ఎస్సైతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణీకులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్రం అయ్యింది. పరిస్థితిని నియంత్రించడానికి విమానాశ్రయ సెక్యూటీ టీమ్, సీఐఎస్‌ఎఫ్‌ స్టాఫ్‌ రంగంలోకి దిగారు. విమాన్రాశయ ఉద్యోగిని, సదరు పోలీసు అధికారితో పాటు ఉన్న మిగతా ఇద్దరిని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.




ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదరడంతో కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ సదరు పోలీసు అధికారిని మాత్రం విమానంలో ప్రయాణించేందుకు సిబ్బంది పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో చేసేందేమీ లేక వారు తిరిగి వెళ్లిపోయాడు.