Jasmin Jaffer: ప్రముఖ ఆలయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ పాడు పని..! దేవస్థానం పెద్దలు సీరియస్.. 6రోజులు శుద్ధి పూజలకు ఆదేశాలు..
ఈ వ్యవహారాన్ని ఆలయ కమిటీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. జాస్మిన్ జాఫర్ వీడియో నేపథ్యంలో గురువాయుర్.. (Jasmin Jaffer)

Jasmin Jaffer: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆలయంలో ఆమె చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్ వివాదం రాజేసింది. కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయ కమిటీ పెద్దలు జాస్మిన్ జాఫర్ పై భగ్గుమన్నారు. ఆమె చేసిన నిర్వాకంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆలయ కమిటీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
గురువాయుర్ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 6 రోజుల పాటు వివిధ రకాల శుద్ధి పూజలు ఉంటాయని వెల్లడించారు. 18 రకాల పూజలు, 18 రకాల శ్రీవేలీలు ఉంటాయన్నారు. రీల్ లో భాగంగా జాస్మిన్ జాఫర్ ఆలయంలోని పవిత్ర కొలనులో తన పాదాలు కడుక్కున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.
కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయంలో బిగ్ బాస్ మలయాళం మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన రీల్ రచ్చకు దారితీసింది. సంప్రదాయ చీరలో ఆలయంలోకి వెళ్లిన జాఫర్.. అక్కడ పవిత్ర కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే.. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయ్యింది.
దీనిపై కేరళలోని హిందుత్వ వాదులు భగ్గమన్నారు. జాస్మిన్ జాఫర్ పై విరుచుకుపడ్డారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా, నిబంధనలను తుంగలో తొక్కింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువాయూర్ ఆలయంలోని ఆ కొలను ఎంతో పవిత్రమైనది. విగ్రహ మూర్తులకు ఈ పవిత్ర చెరువులోనే స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు.
పవిత్ర కొలనులో కాళ్లు కడుక్కుంది..
అలాంటి పవిత్ర కొలనులో జాస్మిన్ జాఫర్ ఏకంగా తన పాదాలను కడుక్కుంది. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. జాస్మిన్ జాఫర్ తీరుపై ఆలయ కమిటీ పెద్దలు, హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారాన్ని ఆలయ కమిటీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. జాస్మిన్ జాఫర్ వీడియో నేపథ్యంలో గురువాయుర్ దేవస్థానం బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా నిషేధిత ప్రదేశంలో వీడియోను రికార్డ్ చేసినట్లు ఆరోపించారు. గుడి కొలను, నడప్పురలో వీడియో తీసిందని, ఇది హైకోర్టు ఉల్లంఘన అని ఆలయ కమిటీ చెప్పింది.
పవిత్రమైన కొలనులో ఉత్సవ మూర్తికి స్నానం నిర్వహించేందుకు ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అలాంటి నీటిలో జాస్మిన్ పాదాలు కడగడం అపచారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 రోజుల పాటు కొలనులో శుద్ధి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు.
తాను తీసిన రీల్ తీవ్ర వివాదాస్పదం కావడంతో జాస్మిన్ జాఫర్ స్పందించింది. వెంటనే ఆ రీల్ ను డిలీట్ చేసింది. క్షమాపణలు కూడా చెప్పింది.
జాస్మిన్ జాఫర్ కు బిగ్ బాస్ మలయాళం సీజన్ 6 లో పాల్గొన్నాక పాపులారిటీ పెరిగింది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెల్స్ లో ఆసక్తికరమైన వీడియోలు చేస్తుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అన్యమతస్తులకు ఆలయలోకి ప్రవేశం లేదు..
జాస్మిన్ జాఫర్ తన పాదాలను కోనేరులో కడుక్కోవడంతో.. పవిత్రమైన కొలను అపవిత్రమైనట్లు ప్రకటించారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయాలను ఉల్లంఘించే చర్యగా అభివర్ణించారు. ఆలయం దీర్ఘకాలంగా స్థాపించబడిన నియమాలు సంప్రదాయాల ప్రకారం, గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలోకి హిందూ మతాన్ని విశ్వసించే వారికి మాత్రమే పరిమితం చేయబడింది.
అన్యమతస్తులకు ఆలయంలోకి ప్రవేశం లేదు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కచ్చితంగా నిషేధించబడిందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అన్యమతస్తురాలు ఆలయంలోకి వెళ్లడంతో అపవిత్రం జరిగిపోయింది అంటూ.. పుణ్యహకర్మను తప్పనిసరి చేసింది. ఇది 18 రకాల పూజలు, 18 రకాల శీవేలీలతో సహా ఆరు రోజుల ఆచారాలను ప్రతిబింబించే శుద్ధీకరణ వేడుక.
ఈ శుద్ధి పూజల కాలంలో భక్తులకు దర్శనం ఉండదు. ఈ ఆచారాలు పూర్తయిన తర్వాత మాత్రమే సాధారణ పూజలు, దర్శనాలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుడు ఆచారబద్ధంగా స్నానం చేసే ఆలయ చెరువు పవిత్రత అత్యంత ముఖ్యమైనదని అధికారులు నొక్కి చెప్పారు. ఆలయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి సంప్రదాయాలను పరిరక్షించడం చాలా అవసరమని, శుద్ధీకరణ సమయంలో భక్తులు సహకరించాలని దేవస్థానం కోరింది.
View this post on Instagram
Also Read: కన్యాదానం వేళ కూతురికి బంగారం కాదు.. కత్తి, తుపాకీ ఇవ్వండి: మహాపంచాయత్ పిలుపు