Gyanvapi Case: హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు.. అంతేకాదు..

కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది.

Gyanvapi Case

జ్ఞానవాపి కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

వారం రోజుల్లో పూజలు ప్రారంభం అవుతాయని కోర్టు తెలిపింది. పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్.. జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తామన్నారు.

మసీదు నిర్మాణానికి ముందు ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ఇప్పటికే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా, కోర్టు తీసుకున్న నిర్ణయం ఈ కేసులో కీలక మలుపు అని హిందువుల తరఫు న్యాయవాది అన్నారు. పూజలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని చెప్పారు.

Also Read: జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించిన మైసూరు పురావస్తు శాఖ

Also Read: చైనా సైనికుల‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పిన గొర్రెల కాప‌రులు.. నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకున్న వీడియో

ట్రెండింగ్ వార్తలు