H3N2 Virus : H3N2 వైరస్ వర్రీ.. యాంటీబయాటిక్స్ వాడాలా? వద్దా? డాక్టర్ల కీలక సూచన

H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

H3N2 Virus : H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

ఇన్ ఫ్లుయెంజా వైరస్ H3N2 వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఐదేళ్లలోపు పిల్లలపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ క్రమంలో యాంటీబయాటిక్స్ వినియోగంపై కీలక సూచన చేశారు. ఈ వైరస్ కట్టడికి యాంటీబయాటిక్స్ పని చేయవని నిపుణులు తేల్చి చెప్పారు.

Also Read..H3N2 Virus Scare: హెచ్3ఎన్2 వ్యాప్తితో అప్రమత్తం… పుదుచ్చేరిలో స్కూళ్లు మూసివేత

డాక్టర్లు సూచించిన మందులను వాడి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. బయట యాంటీబయాటిక్స్ కొన్ని పిల్లలకు సొంత వైద్యం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు.

పిల్లల్లో H3N2 వైరస్ లక్షణాలు కనిపించగానే తల్లిదండ్రులు కంగారుపడిపోతున్నారు. యాంటీబయాటిక్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. డాక్టర్ ను సంప్రదించకుండానే కొందరు పేరెంట్స్.. సొంతంగా యాంటీబయోటిక్స్ తీసుకొచ్చి పిల్లలకు ఇస్తున్నారు. యాంటీ బయాటిక్స్ బాగా పని చేస్తాయని వారు నమ్ముతున్నారు. అయితే, ఇందులో నిజం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. H3N2 వైరస్ కట్టడికి యాంటీబయాటిక్స్ ఎంతమాత్రమే పని చేయవని క్లారిటీ ఇచ్చారు.(H3N2 Virus)

Also Read..H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

దేశంలో H3N2 వైరస్ కేసులే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేసే అంశం. తాజాగా మహారాష్ట్రలోని మరో ఇద్దరు ఈ వైరస్ కారణంగా చనిపోయారు. వీరిలో ఒకరు అహ్మద్ నగర్ కు చెందిన వైద్య విద్యార్థి. మరొకరు నాగ్ పూర్ కు చెందిన 73ఏళ్ల వృద్ధుడు. దీంతో ఇప్పటివరకు దేశంలో H3N2 ఇన్ ఫ్లుయెంజా మరణాల సంఖ్య 9కి పెరిగింది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. నివారణ చర్యలపై దృష్టి పెట్టాయి.

పిల్లలు H3N2కి ఎందుకు ఎక్కువగా గురవుతారు?
పిల్లలు H3N2 బారిన పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే, వారి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా వారు ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నారు. వారు పాఠశాలలో ఇతర వ్యాధి సోకిన పిల్లలతో తరచుగా సంప్రదింపులు జరపడం వల్ల ఇది మరింత పెరుగుతుందని నవీ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్, నియోనాటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శిల్పా అరోస్కర్ తెలిపారు. ఇక, చాలామంది పిల్లలు వారి కాలానుగుణ ఫ్లూ వ్యాక్సిన్లను కూడా కోల్పోయారు. ఈ కారణంగా వారు మరింత ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు.(H3N2 Virus)

పిల్లలలో H3N2 ప్రమాదం: ఆసుపత్రిలో అడ్మిషన్లు పెరగడానికి కారణం
”పిల్లలలో H3N2 లక్షణాలు.. అధిక-స్థాయి జ్వరం, చలి, దగ్గు, నోటి శ్వాస సమస్యలు చాలా వారాల పాటు కొనసాగుతాయి. దీని ఫలితంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యుమోనియా.. ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమయ్యే సమస్యల కారణంగా ఎక్కువ మంది పిల్లలకు PICU అడ్మిషన్ అవసరమవుతుంది” అని డాక్టర్లు వివరించారు.

భారతదేశంలో H3n2 వైరస్: ఇది ఎలా వ్యాపిస్తుంది?
H3N2 అంటువ్యాధి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణులు హెచ్3ఎన్2 ఆకస్మిక వ్యాప్తి, లక్షణాల గురించి దేశ ప్రజలను హెచ్చరించారు. “నిరంతర దగ్గు, కొన్నిసార్లు జ్వరంతో కూడి ఉంటుంది. గత రెండు-మూడు నెలలుగా భారతదేశంలో ఈ తరహా జబ్బుకి కారణం ఇన్‌ఫ్లుఎంజా-A సబ్ టైప్ H3N2” అని నిపుణులు తెలిపారు.

Also Read..WHO: పొంచి ఉన్న కొత్త వైరస్‭ల ముప్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

H3N2 నివారణ చిట్కాలు:
* ద్రవాలు తీసుకోవడం పెంచండి
* తగినంత విశ్రాంతి, తగినంత నిద్ర అవసరం.
* పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.(H3N2 Virus)
* చేతుల పరిశుభ్రతను పాటించండి- చేతులు తరుచుగా కడుక్కోవాలి.
* వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోండి.
* రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.

ట్రెండింగ్ వార్తలు