H3N2 Virus Scare: హెచ్3ఎన్2 వ్యాప్తితో అప్రమత్తం… పుదుచ్చేరిలో స్కూళ్లు మూసివేత

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇటీవల హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11 వరకే ఇక్కడ 79 కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది.

H3N2 Virus Scare: హెచ్3ఎన్2 వ్యాప్తితో అప్రమత్తం… పుదుచ్చేరిలో స్కూళ్లు మూసివేత

H3N2 Virus Scare: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ దేశాన్ని వణికిస్తోంది. అనేక రాష్ట్రాల్లో వ్యాధి ప్రభావం పెరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇటీవల హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11 వరకే ఇక్కడ 79 కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి మరింతగా పెరుగుతోంది.

Madhya Pradesh: బోరుబావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం

ఈ నేపథ్యంలో ముందుగానే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది. దీని ప్రకారం హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందకుండా విద్యా సంస్థల్ని మూసివేయాలని నిర్ణయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతి మేరకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి 26 వరకు పుదుచ్చేరిలోని పాఠశాలల్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కేసుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతోనే స్కూల్స్ మూసివేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ మంత్రి ఎ.నమశివాయం ప్రకటించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హెచ్3ఎన్3 బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు మరణాలు మాత్రం సంభవించలేదు.

MP Arvind: చట్టాన్ని గౌరవిస్తాం అన్నవాళ్లు సుప్రీం కోర్టుకు ఎందుకెళ్లారు.. కవిత తీరుపై అరవింద్ విమర్శలు

అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వైద్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఆస్పత్రుల్లో హెచ్3ఎన్2 పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులు కేటాయిస్తోంది. కేసుల సంఖ్య పెరిగితే, వైద్యం సాయం అందించగలిగేలా ఏర్పాట్లు చేస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ పిల్లలతోపాటు, పెద్దవారిపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి చేయాలంటున్నారు.