Madhya Pradesh: బోరుబావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం
మంగళవారం ఉదయం బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, వైద్య బృందం, అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. బోరు బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్, విదిష జిల్లాలో బుధవారం జరిగింది. ఖెర్కెడి పతార్ గ్రామానికి చెందిన లోకేష్ అహివార్ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి, బోరుబావిలో పడిపోయాడు.
మంగళవారం ఉదయం బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, వైద్య బృందం, అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాలుడు పడిపోయిన బోరుబావి 60 అడుగుల లోతు ఉంది. అయితే, బాలుడు 43 అడుగుల లోతులోనే చిక్కుకున్నాడు. దీంతో బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వారు. పైప్ ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందించారు. 24 గంటలు శ్రమించి బాలుడిని బయటకు తీశారు.
వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం బాలుడు మరణించాడు. గత సోమవారం మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, ఎనిమిది గంటలు శ్రమించి బాలుడిని బయటకు తీసింది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.