Madhya pradesh : ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ రియల్ స్టోరీ‘ ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండు..ఆదివారం నీకిష్టమైనచోట ఉండు..అంటూ కోర్టు తీర్పు

ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండు..ఆదివారం నీకిష్టమైనచోట ఉండు..అంటూ ఓ వ్యక్తికి కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది..

Madhya pradesh : ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ రియల్ స్టోరీ‘ ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండు..ఆదివారం నీకిష్టమైనచోట ఉండు..అంటూ  కోర్టు తీర్పు

Updated On : March 15, 2023 / 12:22 PM IST

Madhya pradesh Court :  శోభన్ బాబు, వాణిశ్రీ, శారద నటించిన తెలుగు సినిమా ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ అనే సినిమాలాంటి రియల్ స్టోరీ కోర్టు ఓ వ్యక్తికి వినూత్న తీర్పు ఇచ్చింది. ఇద్దరు భార్యలు ఉన్న ఓ వ్యక్తికి ‘వారంలో మూడు రోజులు ఓ భార్య వద్ద..మరో మూడు రోజులు మరో భార్య వద్ద ఉండు..మిగిలిని ఆదివారం రోజున నీ ఇష్టం నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు’అంటూ తీర్పు ఇచ్చింది మధ్యప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు. అలా ఇద్దరు భార్యలకు ఆ భర్తను సమానంగా పంచింది.మిగిలిన ఒక్కరోజు నీ ఇష్టం అంటూ వినూత్న తీర్పునిచ్చింది ఫ్యామిలీ కోర్టు. కాగా ఈ వినూత్న తీర్పుకు ఆ భర్త. భార్యలిద్దరు అంగీకరించటం మరో విశేషం..!!

‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో కూడా ఇలాంటి ఒప్పందమే ఉంటుంది భర్త శోభన్ బాబు, ఇద్దరు భార్యలు వాణిశ్రీ, శారదల మధ్య..వారంలో మూడు రోజులు శారద వద్ద..మరో మూడు రోజులు వాణిశ్రీ వద్ద ఉంటాడు కథానాయకుడు శోభన్ బాబు. మరో మిగిలిన రోజు ఆదివారం శోభన్ బాబు తల్లిదండ్రుల వద్ద ఉంటాడు. ఇది రీల్ స్టోరీ…కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం ఇద్దరు భార్యలు ఉన్న భర్తకు అచ్చంగా ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో ఉన్న ఒప్పందాన్ని తీర్పుగా ఇచ్చింది కోర్టు..ఇక్కడ మాత్రం సదరు భర్త మిగిలిన ఆదివారం ఒక్కరోజు అతనికి ఇష్టమైన చోట ఉండవచ్చని వెలుసుబాటు కల్పించింది ఫ్యామిలీ కోర్టు..సదరు భర్త ఇష్టప్రకారం ఇద్దరు భార్యల్లో ఎవరితోనైనా ఉండొచ్చని ఒప్పందాన్ని కుదిర్చింది..

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ఈ రియల్ స్టోరీ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి హరియాణాలోని మల్టీనేషనల్‌ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతను 2018 మేలో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది.వారిద్దరు బాగానే ఉండేవారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు.ఈక్రమంలో 2020లో కరోనా వల్ల భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో సదరు వ్యక్తి భార్యతో కలిసి గ్వాలియర్ కు వచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అలా ఆ తరువాత కొన్ని రోజులకు అతను తిరిగి గురుగ్రామ్ వెళ్లిపోయాడు భార్యను తీసుకెళ్లకుండానే. లాక్ డౌన్ ఎత్తివేసినా అతను తిరిగి గ్వాలియర్ కు రాలేదు. భార్యాబిడ్డలను తీసుకెళ్లలేదు. భర్త కోసం ఎదురు చూసి చూసి ఎంతకూ రాకపోవటంతో ఆమె గ్వాలియర్ కు వెళ్లింది.

Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

అక్కడకు వెళ్లిన ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది. అతని కంపెనీలో పనిచేసే ఓ మహిళను తన భర్త వివాహం చేసుకున్నాడని తెలిసి షాక్ అయ్యింది. దీంతో తన భర్త తనను మోసం చేశాడని తన బిడ్డకు, తనకు న్యాయం చేయాలని కోరుతు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అలా ఆరు నెలలపాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈక్రమంలో తాజాగా ఫ్యామిలీ కోర్టు వినూత్న తీర్పునిస్తూ మూడు రోజులు ఓ భార్య వద్దా..మరో మూడు రోజులు మరో భార్య వద్ద ఉండాలని..మిగిలిన ఆదివారం మీకు ఎవరివద్ద ఉండాలనిపిస్తే వారి వద్ద ఉండవచ్చు అని తీర్పుచెప్పింది. భర్త, ఇద్దరు భార్యలకు కౌన్సెలింగ్ నిర్వహించింది. చివరకు భర్త తోపాటు ఇద్దరు భార్యలు ఈ ఒప్పందానికి అంగీకరించారు. ఈ తీర్పు తర్వాత సదరు తన ఇద్దరు భార్యలకు చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

High Court : సహజీవనం వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయి..కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు

కాగా ఈ కేసు విచారణ మంగళవారం ( మార్చి14,2023) విచారణ జరగాల్సి ఉండగా ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్, న్యాయవాది హరీష్ దేవాన్ తో ఈ కేసు విషయంలో ముగ్గురి మధ్య సయోధ్య కుదర్చాలని కోరింది. అలా వారు మూడు రోజులు పాటు భర్తలను షేర్ చేసుకోవటానికి అంగీకరించారు. దీనికి అంగీకరించకపోతే నీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్నందుకు నీ జీవితం నాశనం అయిపోతుంది..కోర్టుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. నీకు శిక్ష కూడా పడుతుంది. నీ మొదటి భార్య విడాకులకు అంగీకరించినా నీవు భరణం ఇవ్వాల్సి ఉంటుంది..నీ ఉద్యోగం కూడా పోవచ్చు.. కాబట్టి ఈ ఒప్పందానికి అంగీకరించు అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో సదరు భర్త ఈ ఒప్పందానికి అంగీకరించాడు. ఈ ఒప్పందానికి భర్త అంగీకరించటం విశేషం కాదు..ఇద్దరు భార్యలు అంగీకరించటం విశేషం అనే చెప్పాలి..

Supreme Court : సహజీవనం చేస్తున్న జంట బిడ్డను అక్రమ సంతానమని కేరళ హైకోర్టు తీర్పు..వ్యతిరేకించి సంచనల తీర్పునిచ్చి సుప్రీంకోర్టు..