WHO: పొంచి ఉన్న కొత్త వైరస్‭ల ముప్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్‌-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్‭లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మీతో పాటు మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్‌, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటి దగ్గరే ఉండటం, చేతులు శుభ్రపరచుకోవడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

WHO: పొంచి ఉన్న కొత్త వైరస్‭ల ముప్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Drop in COVID alertness could trigger new variant

WHO: ఇంత కాలం కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. అయితే మరిన్ని వైరస్‭ల ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. పలు రకాల వైరస్‌లు, వ్యాధికారకాలు ప్రస్తుతం అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొవిడ్-19 కొత్త వేరియంటుతో పాటు కొత్త వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. పౌరులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.

iQoo 11 Series : వచ్చే జనవరి 10న ఐక్యూ 11 సిరీస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్‌-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్‌ కేర్ఖోవ్‌ మాట్లాడుతూ ‘ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్‌-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్‭లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మీతో పాటు మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్‌, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటి దగ్గరే ఉండటం, చేతులు శుభ్రపరచుకోవడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముప్పుకు సంబంధించి ముందే తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చు’ అని స్పష్టం చేశారు.

Parliament Winter Session: ఇప్పుడు చెప్పండి, పప్పు ఎవరు?.. లోక్‭సభలో మోదీ ప్రభుత్వంపై మహువా ఫైర్

ఇక కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 500లకు పైగా ఒమిక్రాన్‌ ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని వెల్లడించారు. ఈ వేరియంట్ల వ్యాప్తి, రోగనిరోధకత నుంచి అవి ఏ విధంగా తప్పించుకుంటున్నాయి, వాటి తీవ్రత వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. అమెరికాలో ఇటీవల పెరుగుతోన్న శ్వాసకోశ సంబంధ కేసులను డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు ప్రధానంగా ప్రస్తావించారు.