iQoo 11 Series : వచ్చే జనవరి 10న ఐక్యూ 11 సిరీస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQoo 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQoo) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. iQoo 11 సిరీస్ (iQoo Series) భారతీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

iQoo 11 Series : వచ్చే జనవరి 10న ఐక్యూ 11 సిరీస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQoo 11 Series launch in India on January 10 _ All you need to know

iQoo 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQoo) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. iQoo 11 సిరీస్ (iQoo Series) భారతీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. 91Mobiles ప్రకారం.. iQoo కంపెనీ అధికారిక కమ్యూనిటీలో iQoo 11 సిరీస్ జనవరి 10, 2022న లాంచ్ అవుతుందని ధృవీకరించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో ఐక్యూ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించారు. iQoo 11 5G ఫోన్, iQoo 11 Pro 5G సిరీస్ జనవరి 10, 2022న అందుబాటులోకి రానుంది. MySmartPrice నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 13న భారత మార్కెట్లో సేల్ ప్రారంభం కానుందని నివేదిక పేర్కొంది. దేశంలో iQoo 11 Pro లాంచ్ గురించి ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు.

iQoo 11 ఫీచర్లు (అంచనా) :
iQoo 11 స్మార్ట్‌ఫోన్ 1440×3200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల Samsung E6 AMOLED స్క్రీన్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 2 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా పొందవచ్చు. గరిష్టంగా 16GB UFS 4.0 RAMతో వచ్చింది. ఈ సిరీస్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్‌తో వస్తుంది. దీని ద్వారా యూజర్లు ర్యామ్‌ను 8GB వరకు విస్తరించవచ్చు. హ్యాండ్‌సెట్ గరిష్టంగా 512GB UFS 4.0 స్టోరేజీని అందిస్తుంది.

iQoo 11 Series launch in India on January 10 _ All you need to know

iQoo 11 Series launch in India on January 10 _ All you need to know

Read Also : iQOO Neo 7 SE Launched : 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఐక్యూ Neo 7 SE ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

కెమెరా ముందు.. iQoo 11 ఫోన్ 50MP Samsung GN5 ప్రైమరీ సెన్సార్‌తో 13MP పోర్ట్రెయిట్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వస్తుంది. మరోవైపు, iQoo 11 Pro 50MP ప్రధాన కెమెరాతో 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 13MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో వస్తుంది. iQoo 11 స్మార్ట్‌ఫోన్ 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, ఈ Pro మోడల్‌కు 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 50వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనుంది.

iQoo 11 ధర (అంచనా) :
చైనా మార్కెట్లో iQoo 11 ప్రారంభ ధర (CNY) 3,700తో వస్తుంది. సుమారుగా రూ. 45వేలకు అందుబాటులో ఉండనుంది. ఈ ఐక్యూ స్మార్ట్‌ఫోన్ మోడల్ (8GB+128GB, 8GB+256GB, 12GB+256GB,16GB+512GB) నాలుగు వేర్వేరు మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. iQoo అధికారిక మలేషియా-Facebook పేజీలో ప్రకటించింది.

అధికారిక డిజైన్ ఇంకా వెల్లడి కానప్పటికీ.. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ భారీ బ్యాటరీతో వస్తుందని iQoo తెలిపింది. అధికారిక పోస్టర్ iQoo 11లో 5G సపోర్టును కూడా వెల్లడిస్తుంది. అంటే iQoo 11 కనీసం iQoo 10 Pro 200W ఛార్జింగ్ స్పీడ్‌తో రావొచ్చు. చైనాలో అందుబాటులో ఉన్న iQoo 10 Pro 200W ప్రొప్రైటరీ ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్‌ని పొందవచ్చు. వనిల్లా iQoo 10 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. లేకపోతే, Snapdragon 8 Gen 2 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సామర్థ్యాలను కూడా అన్‌లాక్ చేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iQOO 9T Discount : అమెజాన్‌లో iQOO 9T స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?