Haldwani Violence : ఉత్తరాఖండ్‌లో చెలరేగిన హింస.. నలుగురు మృతి, వందల మందికి గాయాలు..

హల్వాని ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Haldwani violence

Uttarakhand : ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో చెలరేగిన హింస కారణంగా నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు హల్ద్వానీలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన మదర్సాలను కూల్చివేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుల్డోజర్లతో వెళ్లిన ప్రభుత్వ అధికారులపై వ‌న్‌బుల్‌పురా ప్రాంతంలోని ప్రజలు దాడికి దిగారు. మదర్సా కూల్చివేత ఘటనను అడ్డుకునేందుకు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ వర్కర్లు, పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న వాహనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు.

Also Read : Komatireddy Rajgopal Reddy : నేను మంత్రి అవుతా.. అప్పుడే వాళ్లు కంట్రోల్‌లో ఉంటరు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హల్వాని ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మదరసా, మసీదును అక్రమ స్థలంలో కట్టారని, దాన్ని కూల్చివేయాలని కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ అధికారులు పోలీసుల సాయంతో అక్కడకు వచ్చారని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్కడకు వెళ్లినట్లు ఎస్పీ ప్రహ్లాద్ మీనా తెలిపారు.

Also Read : India Space Mission: వరుస ప్రయోగాలు.. అంతరిక్ష రంగంలో సత్తాచాటేందుకు సిద్ధమైన భారత్ ..

హల్వానీ హింసపై నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) వందనా సింగ్ మాట్లాడారు. కూల్చివేత డ్రైవ్ శాంతియుతంగా ప్రారంభమైంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు బలగాలను మోహరించాం. మా మున్సిపల్ కార్పొరేషన్ బృందంపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. కూల్చివేత డ్రైవ్ నిర్వహించే రోజు పోలీసు బలగాలను మోహరించాలని ముందే నిర్ణయించాం. తొలుత అధికారుల బృందంపై రాళ్లు వేసిన గుంపును పోలీసులు చెదరగొట్టారు. ఆ తరువాత వచ్చిన రెండో గంపు వద్ద పెట్రోల్ బాంబులు ఉన్నాయి. పోలీసులు ఎలాంటి రెచ్చగొట్టే ప్రక్రియ చేయలేదు.. శాంతియుతంగా వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అధికారుల బృందంపై ఆందోళన కారులు దాడికి తెగబడ్డారని వందనా సింగ్ అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది మతపరమైనది కాదు, దీనిని మతపరమైన, సున్నితంగా చేయవద్దని స్థానికులను అభ్యర్థిస్తున్నామని డీఎం అన్నారు. అయితే, హల్ద్వానీలో ఆక్రమణలను కూల్చివేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు డీఎం చెప్పారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు