హర్యానా లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు

హర్యానాలో మహిళల కోసం త్వరలో ప్రత్యేక బస్సులను నడపునున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంబాలా, పంచకుల, యమునానగర్, కర్నాల్, కురుక్షేత్ర జిల్లాల్లో పైలట్ బెసిస్ “ఛత్ర పరివహన్ సురక్ష యోజన” కింద మహిళలకు మాత్రమే బస్సులను ప్రారంభించనుంది.
ఛీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖత్తర్ ఈ పథకం గురించి విద్యా, రవాణా శాఖల అధికారులతో సమీక్షించారు. విద్యార్థినిలు, ఉద్యోగం చేసే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ప్రతి బస్సులో మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని ఆయన తెలిపారు.
దీంతోపాటుగా బస్సులు అవసరం లేని చోట చిన్న వాహనాలను ఉపయోగించి అమ్మాయిలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. ఈ స్కీమ్ విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ఐదు జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల అధికారులతో ఉన్నత విద్యా శాఖ డైరెక్టర్ ఎ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించనున్నారు.