Haryana : ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్.. సమస్యను తొందరగా పరిష్కరించాలన్న సుప్రీం

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ చట్టంపై హరియాణా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. నెలరోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు...

Haryana : ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్.. సమస్యను తొందరగా పరిష్కరించాలన్న సుప్రీం

Site

Updated On : February 17, 2022 / 2:40 PM IST

Haryana 75% Quota For Locals In Private Jobs : ప్రేవేటు ఉద్యోగాల్లో సాధారణంగా రిజర్వేషన్ లాంటివి ఉండవు. కానీ హారియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఏకంగా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ అంశం హైకోర్టు మెట్లు ఎక్కింది. స్థానికులకే ఉద్యోగాలపై హరియాణా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే చెందాలనే చట్టాన్ని హైకోర్టు నిలుపుదల చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది హరియాణా ప్రభుత్వం. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది.

Read More : covid-19 Vaccination : 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్న రాష్ట్రం..

2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం తీర్పును వెలువరించింది. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ చట్టంపై హరియాణా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. నెలరోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. నాలుగు వారాల గడువులోగా విచారణ జరిపేలా హైకోర్టును అభ్యర్థించాలని ప్రతిపాదిస్తున్నట్లు, మెరిట్ వ్యవహారంలో కల్పించుకోవాలని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. ఎలాంటి వాయిదాలు లేకుండా ఇరుపక్షాలు కోర్టు ముందు హాజరు కావాలని సూచించింది. ప్రైవేటు సంస్థల యజమానులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.