Committed to women safety: Yogi Adityanath ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్య అదేవిధంగా కేసులో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తన ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శుక్రవారం యోగి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…. తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.యూపీలో తల్లులు, కూతుళ్లపై చెడు ఆలోచనలు వస్తేనే భయపడేలా ఓ ఊదాహరణగా నిలిచేలా చర్యలు తీసుకుంటామాని హామీ ఇచ్చారు.
భవిషత్తులో సైతం వారిపై నేరాలకు పాల్పడకుండా ఉండేలా శిక్షిస్తామన్నారు. ఇది తమ ప్రభుత్వ నిబద్ధత, హామీ అని యోగి ట్వీట్ చేశారు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉందని యోగి చేశారు.
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020