Yashwant Sinha: “ఏ పార్టీలో జాయిన్ కాను.. ఎప్పటికీ ఇండిపెండెంట్‌గానే ఉంటా”

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవలి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతుతో పోటీకి నిలిచిన యశ్వంత్.. ఓటమి తర్వాత ఎటువంటి పార్టీలో చేరనని అంటున్నారు. సిన్హా... ప్రజా జీవితంలో తన పాత్ర ఇంకా నిర్ణయించుకోలేదని అన్నాడు.

 

 

Yashwant Sinha: మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవలి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతుతో పోటీకి నిలిచిన యశ్వంత్.. ఓటమి తర్వాత ఎటువంటి పార్టీలో చేరనని అంటున్నారు. సిన్హా… ప్రజా జీవితంలో తన పాత్ర ఇంకా నిర్ణయించుకోలేదని అన్నాడు.

రాష్ట్రపతి ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిన్హా.. “నేను స్వతంత్రంగా ఉంటా. ఏ ఇతర పార్టీలో చేరను” అని మీడియాతో మాట్లాడారు. తృణమూల్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సిన్హా ఇలా బదులిచ్చారు.

“నాతో ఎవరూ మాట్లాడలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. నేను ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తానో, ఎంత చురుకుగా ఉంటానో చూడాలి. ఇప్పుడు 84 ఏళ్లు, కాబట్టి సమస్యలతో ఎంతకాలం కొనసాగుతానో చూడాలి” అని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు.

Read Also: రాష్ట్రపతి ఎన్నిక పోటీ నుంచి యశ్వంత్ సిన్హా తప్పుకోవాలి: అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

బీజేపీని తీవ్రంగా విమర్శించే యశ్వంత్ సిన్హా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రోజుల ముందు మార్చి 2021లో తృణమూల్‌లో చేరారు. 2018లో ఆయన బీజేపీని వీడారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు