Mamata Banerjee: సీఎం మమతాకు రూ.5లక్షల జరిమానా విధించిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించింది కోల్‌కతా హైకోర్టు.

Mamata Banerjee: సీఎం మమతాకు రూ.5లక్షల జరిమానా విధించిన హైకోర్టు

Mamata Banerjee

Updated On : July 7, 2021 / 2:27 PM IST

HC judge imposes Rs 5 lakh fine on Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించింది కోల్‌కతా హైకోర్టు. బెంగాల్‌ ఎన్నికల సంధర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి కేసు విచారణలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌషిక్‌ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ సీఎం మమత ఆరోపించారు.

ఈ కేసు విషయంలో జస్టిస్ కౌషిక్ చందాను తప్పించి పిటిషన్‌ను మరొక జడ్జికి ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని ఆమె కోరగా.. ఆ పిటీషన్‌ను కౌషిక్ చందానే విచారించారు. మమత పిటిషన్‌ను తోసిపుచ్చిన కౌషిక్ చందా.. న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ రూ. 5లక్షల జరిమానా విధించారు సీఎం మమతకు.

న్యాయమూర్తి స్థానంపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ.. అందుకోసం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ముందుగానే ప్లాన్ వేసుకున్నట్లు ఆరోపించారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన విధుల‌ను ఆమె ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.