Health Workers Fight : రూ.500 కోసం జుట్లు పీక్కున్న హెల్త్ వర్కర్లు.. వీడియో వైరల్

రూ.500 కోసం ఇద్దరు హెల్త్ వర్కర్లు పొట్లాడుకున్నారు. ఇరువురు జుట్లు పీక్కున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు.

Health Workers Fight : కేవలం రూ.500 కోసం ఇద్దరు హెల్త్ వర్కర్లు పొట్లాడుకున్నారు. ఇరువురు జుట్లు పీక్కున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్‌లోని జమౌ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్‌లోని ప్రాథమిక కేంద్రంలో ఇద్దరు మహిళలు రూ.500 కోసం కొట్టుకున్నారు.

ఆస్పత్రిలోనే ఇద్దరు హెల్త్ వర్కర్లు బాహాబాహీకి దిగారు. జోక్యం చేసుకున్న ఓ వ్యక్తి వారిద్దరిని అతికష్టం మీద విడిపించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇద్దరిపై ఇంకా చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే? :
నవజాత శిశువుకు బీసీజీ టీకా కోసం ఆశా కార్యకర్త రింటు కుమారి పీహెచ్‌సీకి తీసుకొచ్చింది. ఏఎన్ఎం (ANM) రంజన కుమారి టీకా వేయడానికి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో ఆశా కార్యకర్త ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతో పాటు మెటర్నిటీ వార్డు సమీపంలో జుట్లు పీక్కున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

ఇప్పటి వరకూ వీరిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలోనే ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ప్రవర్తించడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. జమౌలోనే ఓ ఏఎన్ఎం విధులకు హాజరుకాలేదనే కారణంతో ఆస్పత్రి సిబ్బంది ఒకరు ఆమెనై దాడికి పాల్పడిన వీడియో కూడా వైరల్ అయింది.

Read Also : Andhra Pradesh PRC : పీఆర్సీ పిటిషన్.. నిర్ణయం తీసుకొనే అధికారం తమకు లేదు

ట్రెండింగ్ వార్తలు