Dog helping woman : మహిళతో పాటు చెత్తా చెదారం మోసిన శునకం.. ఇలాంటి పనులు చేయంచడం తప్పంటున్న నెటిజన్లు

శునకం నమ్మిన బంటు అని చెప్పాలి. తనను ప్రేమగా పెంచే వారిపట్ల విశ్వాసం చూపిస్తుంది. చెత్తా, చెదారం మోసుకెళ్తున్న ఓ మహిళకు ఓ శునకం చేసిన సాయం చూస్తే మనసు కదిలిపోతుంది.

Dog helping woman

Dog helping woman : శునకం ఎంతో విశ్వాసం ఉన్న జంతువు. తనకు ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టే వారి పట్ల ఎంతో విధేయతతో ఉంటుంది. తాజాగా ఓ చెత్త తరలించే మహిళకు సాయం చేస్తున్న శునకం వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల మనసు కదిలిపోయింది.

Agra : గుండెలు పిండే విషాదం.. కారులో ఊపిరాడక చనిపోయిన శునకం, వాళ్లసలు మనుషులేనా? ఏం చేసినా పాపం లేదు

@TheFigen_ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘శునకాలు నిజంగా మన ఆత్మీయ నేస్తాలు’ అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. వీడియోలో స్క్రాప్‌తో నిండిన బ్యాగ్ మోస్తూ ఓ మహిళ రోడ్డుపై వెడుతూ కనిపిస్తుంది. ఆమెను అనుసరిస్తూ ఓ శునకం చెత్త బ్యాగ్‌ను లాగడం కనిపిస్తుంది. ఆమెకు ఎంతో ప్రేమగా సాయం చేస్తున్న ఆ శునకం మంచితనం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిలియన్‌కి పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది.

Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్

‘శునకాలు ఎప్పుడూ మనిషికి మంచి మిత్రులే’ అని .. ‘డాగ్స్ పని చేయడానికి ఇష్టపడతాయి’ అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ‘వాటితో ఇలాంటి బరువైన పనులు చేయించడం తప్పు.. దానిని చూస్తే జాలి కలుగుతోంది’ అని కామెంట్ చేశారు.