North India : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.

Northern States Rain

Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతాన్ని వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు పలు నగరాల్లోని కాలనీలు నీట మునుగుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

హిండన్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నోయిడా, ఘజియాబాద్‌లోని పలు కాలనీలు నీటమునిగాయి.  ఢిల్లీలో యుమునా నది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. డేంజర్ మార్క్‌ నుంచి కాస్త తగ్గినా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఢిల్లీని ఎడతెరిపి లేని వర్షాలు ముంచుతున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి.

Cargo Ship: కార్గో నౌక‌లో భారీ అగ్నిప్రమాదం.. మూడువేల కార్లు బుగ్గి.. సిబ్బంది ఎలా ప్రాణాలు దక్కించుకున్నారంటే?

మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు. రెండు రోజులుగా సుమారు 350 పాత కార్లు వరద నీటిలోనే ఉండిపోయాయి. నోయిడా ఎకోటెక్ ప్రాంతంలోని గ్రౌండ్‌లో పార్క్‌ చేసిన పాత ఓలా కార్లు వరదలో మునిగిపోయాయి. వరద తగ్గితే తప్ప వీటిని బయటకు తీసే పరిస్థితి లేదు.

ఇప్పటికే హిండన్ నది ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండు విద్యుత్ సబ్‌ స్టేషన్లు మునిగిపోవడంతో.. రాజ్‌నగర్‌ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు ఘజియాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది.

TS Education Department: వర్షం ఎఫెక్ట్ .. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శుక్రవారం కూడా సెలవు ..

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి .. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఘజియాబాద్‌లో హిండన్‌ నది వరద ప్రభావితం ప్రాంతంలో ఉన్న సుమారు 7 వేల మందిని ఖాళీ చేయించారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజస్థాన్‌లో సైతం భారీ వర్షాలకు నదుల్లో వరద పెరుగుతోంది. రాజస్థాన్‌లోను వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు పొంగుతున్నాయి. ఉదయ్‌పుర్- మౌర్వానియా మధ్య కల్వర్టును వరద ముంచెత్తింది. దానిని దాటే ప్రయత్నంలో ఇద్దరు యువకులు అందులో చిక్కుకుపోయారు. సహాయకసిబ్బంది క్రేన్ సహాయంతో వారిని కాపాడారు.

ట్రెండింగ్ వార్తలు