Delhi : ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు

సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.

Delhi Independence Day celebrations

Delhi Independence Day celebrations : ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబు అయింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్రం 1800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది. సర్పంచులు, రైతులు, పార్లమెంట్ నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, హర్ ఘర్ జల్ కార్మికులు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్య కారులకు ఆహ్వానించింది.

ఆయా రాష్ట్రాల నుంచి తమ రాష్ట్ర సాంప్రదాయ దుస్తుల్లో జంటలు వేడుకలకు హాజరయ్యారు. ఆహ్వానితుల్లో హై-సెక్యూరిటీలో జోన్లో 268 మంది వీఐపీలకు చోటు కల్పించారుు. జ్ఞాన్‌పథ్‌లో 1,000 మందికి, మాధవ్ దాస్ పార్క్‌లో 4,766 మందికి, ఆగస్టు 15 పార్క్‌లో 20,450 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Independence Day 2023: ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ .. ముఖ్యమైన అంశాలు ఇవే..

10వేల మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం 1,000 సెక్యూరిటీ కెమెరాలు, 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమేరాలు, 3-4 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు భద్రతా విధుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ట్రాఫిక్ విధుల్లో 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.

సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

Tomatoes : ఆగస్టు 15 నుంచి రూ.50కి తగ్గిన టమాటాల ధర

రానున్న 25 ఏళ్లు (అమృత్ కాల్) లక్ష్యాల గురించి వివరించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ విజయాలతో పాటు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న చట్టాల గురించి ప్రధాని ప్రస్తావించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, విపక్ష కూటమి గురించి ఎర్రకోట వేదికగా మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది.